తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాగ్ (CAG ) నివేదికను రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) ప్రవేశ పెట్టింది. ఈ నివేదిక లో ఆసరా పింఛన్ల (Supportive Pensions ) పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆసరా ఫించన్ల లో గోల్మాల్ జరిగిందని తేల్చింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఆసరా పింఛన్లను పంపిణీ చేశారని, 16% మందికి అర్హత లేకున్నా జారీ చేశారని పేర్కొంది. 2018-21 మధ్య ఆడిట్ చేసిన కాగ్.. ఆసరా డేటా బేస్, సమగ్ర కుటుంబ సర్వే మధ్య వ్యత్యాసం ఉందని వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పుబట్టింది. పీసీఎస్‌ఎస్ ప్రాజెక్టు అంచనా వ్యయం 38 వేల 500 కోట్లు. అయితే.. రీ-ఇంజనీరింగ్ సమయంలో కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు రెండింటికీ కలిపి 85 వేల 651.81 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. రీ-ఇంజనీరింగ్ కారణంగా ఉమ్మడి ప్రాజెక్టు వ్యయం 122 శాతం మేర పెరిగిందని కాగ్ తెలిపింది. లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టు 52.22 శాతం మేర మాత్రమే పెరిగిందని వెల్లడించింది. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇప్పుడు లక్షా 47 వేల 427.41 కోట్లకు చేరిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అయితే.. లక్ష్యంగా పెట్టుకున్న ప్రయోజనాల్లో మాత్రం తదుపరి పెరుగుదల ఏమీ లేదని వివరించింది. ఆ విధంగా రెండు ప్రాజెక్టుల సంయుక్త విలువ ఇప్పుడు లక్షా 51 వేల 168.21 కోట్లుగా ఉంది.
పీసీఎస్‌ఎస్ ప్రాజెక్టుతో పోలిస్తే.. రీ-ఇంజనీరింగ్ తర్వాత లిఫ్టులను నడపడానికి అయ్యే వార్షిక విద్యుచ్ఛక్తి 5, 643.39 మిలియన్ యూనిట్ల మేర పెరిగిందని కాగ్ తెలిపింది. విద్యుత్ వినియోగంపై ఏటా అయ్యే ఖర్చు 3 వేల 555.34 కోట్ల మేర పెరిగిందని వెల్లడించింది.
Read Also : Vaddiraju Ravichandra: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి గా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్