Site icon HashtagU Telugu

NTR To Meet Amit Shah Again : మరోసారి జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ.. నిజమేనా..?

NTR To Meet Amit Shah Again

NTR To Meet Amit Shah Again

తెలంగాణ ఎన్నికల సమయం (Telangana Elections Time) దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలకు సంబదించిన అనేక వార్తలు బయటకు వస్తూ ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే ఎన్నో విషయాలు బయటకు రాగా..తాజాగా బిజెపి (BJP) కి సంబదించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. అదే కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah)..జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో భేటీ కాబోతున్నారనే వార్త ఇప్పుడు చర్చగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో హైదరాబాద్ నోవెటల్ లో జూ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ ఐన సంగతి తెలిసిందే. దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇరువురు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఆ సమయంలో మాత్రం దేశ వ్యాప్తంగా అంత మాట్లాడుకున్నారు. ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఎన్టీఆర్ తో మరోసారి అమిత్ షా భేటీ కాబోతున్నారనే వార్త ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్ర నాయకత్వం ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో రాజకీయంగా కూడా ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. భేటీ అనేది జరిగితే ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకోబోతున్నారు..? రాజకీయ కారణాలా..? ఇతర అంశాలా..? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు.

ఇక మిగతా పార్టీలతో పోలిస్తే రాష్ట్రంలో బిజెపి ప్రచారం పెద్దగా ఏమిలేదు. ప్రజల్లో కూడా గత 6 నెలల క్రితం వరకు బిజెపి ఫై నమ్మకం ఉండేది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కసారిగా బిజెపి ని డౌన్ చేసాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బిజెపి నుండి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడం కూడా మైనస్ గా మారింది. మరి వీటి ప్రభావం పార్టీ ఫై ఎంత మేర పడుతుందో చూడాలి.

Read Also : Onion prices: సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు, మూడు రెట్లు పెంపుతో సామాన్యుల ఇబ్బందులు!