NTR Statue : హ‌రే కృష్ణా, హ‌రే ఎన్టీఆర్! విగ్ర‌హంపై లీగ‌ల్ ఫైట్

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ (NTR Statue)మ‌హ‌ర్జాత‌కుడు, క‌లియుగ‌పురుషుడు, విశ్వ‌విఖ్యాత న‌ట‌సౌర్య‌భౌముడు, రాముడు, కృష్ణుడు(Krishna),దుర్యోధ‌నుడు

  • Written By:
  • Updated On - May 17, 2023 / 02:48 PM IST

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ (NTR Statue)మ‌హ‌ర్జాత‌కుడు, క‌లియుగ‌పురుషుడు, విశ్వ‌విఖ్యాత న‌ట‌సౌర్య‌భౌముడు, రాముడు, కృష్ణుడు(Krishna), దుర్యోధ‌నుడు ఆహార్యం ఎలా ఉంటుందో క‌ళ్ల‌కుక‌ట్టిన‌ట్టు చూపించిన మ‌హాన‌టుడు. ఆయ‌న్నే కృష్ణుడు, రాముడుగా పూజించే వాళ్లు ఉన్నారు. ప్ర‌త్యేకించి కృష్ణుడుగా ఆయ‌న వేసిన వేషం తాలూకూ క‌టౌట్ ను చూసి చేతులెత్తి దండం పెట్టే వాళ్లు చాలా మంది ఉన్నారు. అలా ఆక‌ర్షితులైన వాళ్ల‌లో స్వ‌ర్గీయ ఇందిరాగాంధీ కూడా ఉన్నార‌ని చెబుతుంటారు. ఎందుకంటే, ఆయ‌న పార్టీ పెట్టిన ఆరు నెల‌ల‌కు జ‌రిగిన‌ 1983 ఎన్నిక‌ల్లో కృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ క‌టౌట్ ను ప్ర‌త్యేకంగా ఆమె గ‌మ‌నించార‌ట‌. ఆయ‌న గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని ఎన్నిక‌ల‌కు ముందుగానే ఒక అభిప్రాయానికి ఇందిరా వ‌చ్చార‌ని చెబుతారు. అంటే, ఇందిరాగాంధీని కూడా శ్రీకృష్ణుని వేష‌ధారిగా ఎన్టీఆర్ ఆక‌ర్షించార‌న్న‌మాట‌.

శ్రీకృష్ణుని వేష‌ధారిగా ఎన్టీఆర్ (NTR Statue)

ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు గ‌ర్వంగా చెప్పుకునే హీరో, రాజ‌కీయ సంస్క‌ర‌ణ‌ల మేరున‌గ‌ధీరుడు ఎన్టీఆర్(NTR Statue). ఆయ‌న విగ్ర‌హాల‌ను పెట్ట‌డాన్ని అదృష్టంగా భావిస్తారు. దేవుళ్ల‌ను వివిధ రూపాల్లో కొలిచిన‌ట్టే, ఎన్టీఆర్ ను కూడా ప‌లు రూపాల్లో అభిమానులు చూస్తుంటారు. కొంద‌రు కృష్ణుడిగా (Krishna) మ‌రికొంద‌రు రాముడిగా భావిస్తుంటారు. అంతెందుకు, ధుర్యోధ‌నుడిగా ఉండే ఎస్వీ రంగారావు విగ్ర‌హాన్ని ఇటీవ‌ల ఏపీలోని ఆయ‌న స్వ‌గ్రామంలో ఆవిష్క‌రించారు. ఎవ‌రూ అభ్యంత‌ర పెట్ట‌లేదు. కానీ, ఖ‌మ్మం వేదిక‌గా ఏర్పాటైన కృష్ణుని వేషంలోని ఎన్టీఆర్ ఆగ్ర‌హం మీద అభ్యంత‌రాలు వ‌స్తున్నాయి. సినిమా రంగానికి చెందిన క‌రాటీ క‌ల్యాణి(karate kalyani) కృష్ణుడిగా ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హంను వ్య‌తిరేకిస్తున్నారు. మీడియాముఖంగా నానా యాగీ చేశారు ఆమె. కృష్ణుడిగా రాబోవు రోజుల్లో ఎన్టీఆర్ ను కొలుస్తార‌ని ఆందోళ‌న చెందారు. హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రుస్తున్నార‌ని ఆగ్ర‌హించారు. ప‌లు టీవీ చాన‌ళ్ల‌లో ఈ అంశం మీద ర‌చ్చ‌ర‌చ్చ చేశారు.

యాద‌వుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా ఎన్టీఆర్ ను శ్రీకృష్ణుడి మాదిరిగా

స్వర్గీయ ఎన్టీఆర్ ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన క‌రాటీ క‌ల్యాణి(karate Kalyani) మీద న్యాయ‌పోరాటానికి దిగారు మంచు విష్ణు. మా అధ్య‌క్షుని హోదా ఆమెకు నోటీసులు ఇచ్చారు. క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ఈ నోటీసులు జారీ చేయ‌డం వివాద‌స్ప‌దం అవుతోంది. ఖ‌మ్మంలో ఏర్పాటు చేసిన విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌ను(NTR Statue) అడ్డుకోవాల‌ని క‌ల్యాణి యాద‌వుల‌కు పిలుపునిచ్చారు. ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన దేవుడిగా శ్రీకృష్ణుడికి ఆపాదిస్తూ ఆమె మాట్లాడారు. యాద‌వుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా ఎన్టీఆర్ ను శ్రీకృష్ణుడి మాదిరిగా చిత్రీక‌రిస్తున్నార‌ని క‌మ్మ సామాజిక‌వ‌ర్గం మీద విరుచుకుప‌డుతున్నారు. సినిమా రంగానికి పేరుప్ర‌ఖ్యాతులు తెచ్చిపెట్టిన ఒక మ‌హానుభావుని విగ్ర‌హం పెడుతుంటే స‌మ‌ర్థించ‌కుండా రాద్ధాంతం చేయ‌డాన్ని మా అధ్య‌క్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఖండిస్తున్నారు. ఇలాంటి వివాదాల న‌డుమ శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్ర‌హం వివాద‌స్ప‌దంగా మారింది.

Jr NTR: చంద్రబాబు వ్యూహంలో జూనియర్! భలే ట్విస్ట్

ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బ‌ల‌హీనంగా ఉంది. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేలు మిన‌హా ఆ పార్టీకి ఉనికి లేకుండా ఉంది. అందుకే, అక్క‌డ బ‌ల‌ప‌డాల‌ని ప్లాన్ చేస్తూ ఎన్టీఆర్ విగ్ర‌హం(NTR Statue) ఏర్పాటుకు రంగం సిద్దం చేసింద‌ని తెలుస్తోంది. మంత్రి పువ్వాడ అజ‌య్(Puvvada ajay) విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని భుజ‌స్కంధాల‌పై వేసుకున్నారు. శ్రీకృష్ణుడి(Krishna) రూపంలో ఉండే ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని 54 అడుగుల ఎత్తుగా నిర్మించారు. దాని ఆవిష్క‌ర‌ణ‌కు ఈనెల 28న జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రు కాబోతున్నారు. ఆ మేర‌కు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇదంతా రాజ‌కీయంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో భాగంగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు భావిస్తున్నారు. రాజ‌కీయంగా ఒక కోణం నుంచి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు చూస్తుంటే, హిందూ ఆధ్మాత్మిక కోణాన్ని క‌రాటీ క‌ల్యాణి బ‌య‌ట‌కు తీస్తున్నారు. సామాజిక‌వ‌ర్గాల ఆధిప‌త్య కోణాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

Also Read : NTR Statue : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై వివాదం.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..