Site icon HashtagU Telugu

NTR GEST Scholarship : ఇంటర్ విద్యార్థినులకు ప్రతినెలా 5వేల స్కాలర్‌షిప్

Ntr Gest Scholarship

Ntr Gest Scholarship

NTR GEST Scholarship :  ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఏటా గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (NTR GEST Scholarship) నిర్వహిస్తుంటుంది. 2024 సంవత్సరంలో స్కాలర్ షిప్ ఇచ్చేందుకు విద్యార్థినులను ఎంపిక చేసే ప్రక్రియకు ఎన్టీఆర్ ట్రస్ట్ శ్రీకారం చుట్టింది.  GEST -2024  ఉపకారవేతన పరీక్షను డిసెంబర్‌ 17న నిర్వహిస్తామని వెల్లడించింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు నవంబర్‌ 18 నుంచి డిసెంబర్‌ 15 వరకు అప్లై చేయొచ్చని వెల్లడించింది. ఈ పరీక్షలో మొదటి 25 స్థానాల్లో నిలిచే బాలికలకు స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేలు చొప్పున ఎన్​టీఆర్ బాలికల జూనియర్‌ కళాశాలలో రెండేళ్ల ఇంటర్‌ కోర్సు పూర్తి చేసేవరకు అందిస్తారు. ఎన్​టీఆర్ జూనియర్ మహిళా కళాశాల హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్‌లో ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు స్కాలర్‌షిప్ టెస్టుకు అప్లై చేసేందుకు అర్హులు. ఆబ్జెక్టివ్ టైప్‌లో మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్​, పదో తరగతి స్థాయి రీజనింగ్ ప్రశ్నలు అడుగుతారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. డిసెంబర్ 17న ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది. పరీక్ష ఫీజు  200 రూపాయలు. పరీక్ష కేంద్రానికి విద్యార్థినులు రెండు పాస్​పోర్ట్ సైజ్ ఫొటోలు, బ్లాక్ బాల్ పాయింట్ పెన్​, పాడ్​, స్కూల్ ఐడెంటిటీ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు, మాస్క్​, శానిటైజర్​ తీసుకెళ్లాలి.

Also Read: Plane In Ocean : సముద్రంలో తేలిన రూ.1200 కోట్ల విమానం

విద్యార్థులు ntrtrust అనే లింక్ (​https://ntrtrust.org/ntr-gest-scholarship/) ద్వారా అప్లై చేయొచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో డిసెంబర్ 15 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.పరీక్ష జరిగాక వారంలోగా ఫలితాలను ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ntrtrust వెబ్‌సైట్‌లో(NTR GEST Scholarship) పొందుపరుస్తారు.