Site icon HashtagU Telugu

Lakshmi NTR: ఎన్టీఆర్ ఆత్మతో లక్ష్మీస్ టాక్

lakshmi parvathi

lakshmi parvathi

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సందర్భంగా ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాడు. ఆ విషయాన్ని ఆడియో రూపంలో ఆనాడు వర్మ వినిపించాడు. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఆత్మ గురించి లక్ష్మీ పార్వతి చెబుతుంది. ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని చెప్పారు. ఆ రహస్యాన్ని 26 ఏళ్ల తరువాత చెబుతున్నానని వివరించారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్‌ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారు. ఎన్టీఆర్ ఆత్మ 16ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి తనతో అనేక విషయాలు పంచుకుందని లక్ష్మీపార్వతి తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో తాను మళ్లీ జన్మిస్తానని ఆమెకు చెప్పిందట. ముఖ్యమంత్రుల మనస్సులో తాను ఉంటానని..

ప్రజలకు మంచి చేయాలని తాను ప్రబోధం చేస్తుంటానని ఆయన ఆత్మ తనతో చెప్పిందన్నారు లక్ష్మీపార్వతి. ఆ అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచి తనకు ఓ నమ్మకమని.. ఎన్టీఆర్ ఎప్పుడూ తెలుగు ప్రజలను విడిచిపెట్టి ఉండరని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ఆత్మ ఇక్కడే ఉందని.. ఈ ఘాట్‌ దగ్గరని కాదు కానీ… తెలుగు రాష్ట్రాల ప్రజలందరి వద్ద ఆయన ఆత్మ తిరుగుతూ బాగోగులు చూసుకుంటోందని వ్యాఖ్యానించారు.
బతికున్నంతవరకు ఎన్టీఆర్ తనకు తోడుగా ఉంటారని.. అడుగుడుగనా తనను రక్షించుకుంటూనే ఉన్నారన్నారు.

ఎన్టీఆర్ జ్ఞాపకాల్లోనే తాను ఇంకా బతుకుతున్నానన్నారు లక్ష్మీపార్వతి.
ఇక, ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం ఘటనలపైనా లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయించడం ద్వారా సీఎం జగన్ చాలా హుందాగా వ్యవహరించారని ప్రశంసించారు. దుర్గిలో విగ్రహ ధ్వంసంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానని తెలిపారు. ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలని లక్ష్మీపార్వతి హితవు పలికారు