Site icon HashtagU Telugu

SFI కార్యాలయంపై NSUI కార్యకర్తల దాడి.!!

nsui

nsui

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న SFI కార్యాలయంపై NSUIకార్యకర్తలు దాడి చేశారు. కేరళలోని అటవీ ప్రాంతంలోని బఫర్ జోన్ల ఏర్పాటు విషయంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవడం లేదని నిరసనకు దిగిన SFIకార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 80 నుంచి వందమంది కార్యకర్తలు రాహుల్ గాంధీ కార్యాలయంలో వీరంగం స్రుష్టించారు. అక్కడి వస్తువులను పూర్తిగా ధ్వంసం చేశారు.

SFIకార్యకర్తల దాడిని నిరసిస్తూ…హైదరాబాద్ లోని ఆ పార్టీ కార్యాలయంపై NSUIకార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా కార్యాలయం వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.