Polling Booth : ఇక పోలింగ్ కేంద్రాలను గూగుల్ మ్యాప్‌లో చూసుకోవచ్చు

Polling Booth : కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఓటర్ల కోసం మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

  • Written By:
  • Updated On - November 19, 2023 / 07:30 AM IST

Polling Booth : కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఓటర్ల కోసం మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదే గూగుల్ మ్యాప్. దీన్ని వినియోగించి గూగుల్ మ్యాప్‌ ద్వారా ఓటర్లు తమ పోలింగ్ బూత్‌ లొకేషన్‌ను, దూరాన్ని ముందుగానే చూసుకోవచ్చు. ఈసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘సాధారణ ఎన్నికలు-2023 ఎలక్టోరల్‌ రోల్స్‌’ సెక్షన్‌లో మీ జిల్లా పేరు,  మీ అసెంబ్లీ నియోజకవర్గం పేరు ఎంపిక చేసుకోవాలి. ఆ వెంటనే ఏ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయనే వివరాలు డిస్‌ప్లే అవుతాయి. వాటి పక్కనే తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో గూగుల్‌ మ్యాప్‌ ఉంటుంది. దానిలోకి వెళ్లి మీ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్‌ల లొకేషన్‌‌లను చెక్ చేసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

గ్రేటర్ హైదరాబాద్‌‌లోని ఆ ప్రాంతాల్లో.. 

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. క్రిటికల్‌గా ఉండే ప్రాంతాల్లో రిగ్గింగ్‌కు ఛాన్స్ ఉందన్న అనుమానాలతో ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,119 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1,800 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక పరిస్థితులు ఉన్నాయని ఎన్నికల సంఘం గుర్తించింది. జీహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు ప్రాంతాల్లోని 15 నియోజక వర్గాలలో గోషామహల్, నాంపల్లితో పాటు ఓల్డ్ సిటీలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఈసీకి ఫిర్యాదులు అందడంతో అప్రమత్తమైంది. ఈ అంశంపై రాజాసింగ్, ఫిరోజ్ ఖాన్ లాంటి నేతలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బోగస్ ఓట్ల విషయంలోనూ ఈసీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈక్రమంలో డెత్, అడ్రస్ లేని ఓటర్లను దాదాపు 4లక్షల మందిని లిస్టు నుంచి తొలగించింది. హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ స్థానాలలో 45లక్షల మంది ఓటు హక్కును(Polling Booth) వినియోగించుకోనున్నారు.

Also Read: ICC World Cup Final 2023: కప్పు కొట్టాల్సిందే.. ఫుల్ జోష్ లో టీమిండియా