Site icon HashtagU Telugu

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

TGSRTC

TGSRTC

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో నిరుద్యోగులకు శుభవార్త. టీజీఎస్‌ఆర్టీసీలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ (పనిచేసే కార్మికులు) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబ‌ర్ 8, 2025 నుంచి ప్రారంభమై అక్టోబ‌ర్ 18, 2025 వరకు కొనసాగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు- అర్హతలు

ఈ నోటిఫికేషన్‌లో డ్రైవర్ పోస్టుల కోసం 1,000 ఖాళీలు, శ్రామిక్ పోస్టుల కోసం 743 ఖాళీలు ఉన్నాయి.

డ్రైవర్ పోస్టులు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పాస్ అవ్వడంతో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే డ్రైవింగ్‌లో కనీసం 18 నెలల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 22 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శ్రామిక్ పోస్టులు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస విద్యార్హత ఐదో తరగతి. శారీరకంగా దృఢంగా ఉండడం, ఆర్టీసీ వర్క్‌షాపులలో పనిచేయడానికి ఆసక్తి ఉండడం ముఖ్యం. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read: US Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్‌.. భారీగా ప‌డిపోయిన భారతదేశ ఎగుమతులు!

దరఖాస్తు- ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 400 కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 200గా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియలో మొదట రాత పరీక్ష ఉంటుంది. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్షతో పాటు డ్రైవింగ్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. శ్రామిక్ పోస్టులకు రాత పరీక్ష, శారీరక దృఢత్వ పరీక్ష ఉంటుంది. ఈ రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తుది నియామక పత్రాలు అందజేస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, సిలబస్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.