Site icon HashtagU Telugu

ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 80 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Ecil Recuitment 2025

Ecil Recuitment 2025

ECIL Jobs: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఈఎల్) నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 80 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ (GET) పోస్టులను భర్తీ చేయడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుల గడువు జూన్ 5వ తేదీ వరకు ఉంది.

పోస్టుల వివరాలు:

ఈ పోస్టులకు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారు 2025 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి. ఈ పోస్టులను ఈసీఈ/ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్ టెలీ కమ్యూనికేషన్‌, ఈఅండ్ఐ, ఇనుస్ట్రుమెంటేషన్‌, సీఎస్‌ఈ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఈఈఈ/ఎలక్ట్రికల్‌, సివిల్‌, కెమికల్‌ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 మధ్య జీతం చెల్లిస్తారు.

కేటగిరీ వారీ పోస్టులు:

గమనిక: ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జూన్ 5వ తేదీతో ముగుస్తుంది.

ఎంపిక విధానం:

ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎంపిక 1:4 నిష్పత్తిలో జరుగుతుంది. ఇంటర్వ్యూ కి హాజరయ్యే అభ్యర్థులు అర్హత పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. ఈ వివరాలను అధికారిక వెబ్ సైట్‌లో చూడవచ్చు. ఇంటర్వ్యూ పూర్తయ్యాక, ఫలితాలు విడుదల చేయబడతాయి.

పరీక్ష కేంద్రాలు:

కంప్యూటర్ ఆధారిత పరీక్షలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాలలో నిర్వహించబడతాయి.

దరఖాస్తు ఫీజు:

సందేహాల కోసం:

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే, hrrect@ecil.co.in లేదా madhaviaurorab@ecil.co.in అనే ఈమెయిల్ లకు సంప్రదించవచ్చు.

దరఖాస్తు విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://www.ecil.co.in వెబ్ సైట్ లో వెళ్ళి, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించవచ్చు.

గమనిక: ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక, హాల్ టికెట్ల విడుదల మరియు పరీక్ష తేదీల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.