Site icon HashtagU Telugu

TGSRTC : త్వరలో 3,038 పోస్టులకు నోటిఫికేషన్ – మంత్రి పొన్నం

TGSRTC

TGSRTC

తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. TGSRTCలో మొత్తం 3,038 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు ప్రారంభించామని, త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

CBN Birthday : అనితర సాధ్యుడు మన బాబు

ఈ ఉద్యోగాల్లో డ్రైవర్లకు పెద్దపీట వేసారు. మొత్తం 2,000 డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే శ్రామిక్ పోస్టులు 743 ఉండగా, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) 114, డిపో మేనేజర్ 25 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఆయా విభాగాలకు అనుగుణంగా అర్హతలు, ఎంపిక ప్రక్రియపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఇతర టెక్నికల్, ఇంజినీరింగ్, మెడికల్ విభాగాల్లోనూ అవకాశం ఉంది. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, అకౌంట్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ (జనరల్) 7, మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్) 7 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మంచి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వంపై నమ్మకంతో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది గొప్ప శుభవార్తగా చెప్పొచ్చు.