Site icon HashtagU Telugu

Hydra : అక్రమ నిర్మాణాలపై రేవంత్ ఉక్కుపాదం..ఒకే రోజు వందల ఇళ్లకు నోటీసులు

Notices To Hundreds Of Hous

Notices To Hundreds Of Hous

హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది.

హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బడా ప్రముఖుల అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా..తాజాగా ఈరోజు దుర్గం చెరువు పరిధిలో వందల ఇళ్లకు నోటీసులు జారీ చేసారు. వాల్టా చట్టంలోని సెక్షన్‌ 23(1) కింద నోటీసులు జారీ చేసి, యజమానులు కూల్చకుంటే ఓకే.. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం సామాన్య ప్రజలేకే కాదు స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి సైతం నోటీసులను జారీ చేయడం తో చట్టం ముందు అంత సమానమే అని రేవంత్ చెప్పకనే చెపుతున్నారని అంత మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇంటికి భద్రత పెంచింది ప్రభుత్వం. మధుర నగర్‌లో ఉన్న కమిషనర్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా.. కమిషనర్‌ రంగనాథ్‌ నివాసం దగ్గర ఔట్‌పోస్ట్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కాగా నగరంలో ఇటీవల హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ కు ముప్పు పొంచి ఉండటంతో ఈ భద్రత ఏర్పాటు చేశారు. N కన్వెన్షన్ కూల్చివేత తర్వాత రంగనాధ్ బయటకు రావడం లేదు. ఆఫీసులోనే ఉంటూ అన్ని కార్యకలాపాలు చేస్తున్నారు.

ప్రస్తుతం బుద్దభవన్‌లోని ఆఫీసులో హైడ్రా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చెరువుల ఆక్రమణలపై పెద్దసంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించేందుకు ఇప్పటికే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన హైడ్రా, ఆ పోలీస్ స్టేషన్‌ను బుద్దభవన్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే డిప్యుటేషన్‌పై 259 మంది పోలీసు సిబ్బందిని కోరగా, ఆ సంఖ్య మరింతగా పెరుగుతుందంటున్నారు. మరోవైపు ఇప్పటివరకు కూల్చివేతలకు సంబంధించి ఆక్రమణదారులపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో హైడ్రా కేసులు నమోదు చేసేందుకు రెడీ అయింది. అలాగే అక్రమ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చిన అధికారులపైనా అంతర్గతంగా విజిలెన్స్ విచారణ కొనసాగిస్తోంది. హైడ్రా ఆఫీసుకు అన్ని పార్టీల నుంచి తాకిడి రోజురోజుకు పెరుగుతోంది.

Read Also : Dry Cough: పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!