Tamilisai: చంద్రుడ్నే కాదు.. సూర్యుడ్ని కూడా చేరుకుంటాం: రక్షాబంధన్ వేడుకల్లో తమిళి సై

మనం చంద్రుడిని చేరడమే కాదు, సూర్యుడిని కూడా చేరుకోబోతున్నామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

  • Written By:
  • Updated On - August 30, 2023 / 04:54 PM IST

Tamilisai: మనం చంద్రుడిని చేరడమే కాదు, సూర్యుడిని కూడా చేరుకోబోతున్నామని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం అన్నారు. బుధవారం రక్షా బంధన్‌ సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. చంద్రుడిపైనా రక్షాబంధన్‌ జరుపుకోవచ్చని అన్నారు. చంద్రయాన్3 సక్సెస్ అయినందున ఈ రక్షా బంధన్‌ను జరుపుకుంటున్నందుకు చాలా గర్వపడుతున్నా. అయితే మేము చంద్రునిపై కూడా రక్షా బంధన్ జరుపుకోగలం” అని ఆమె అన్నారు.

“ చంద్రయాన్ 3 లో శాస్త్రవేత్తల పాత్ర చాలా ఉందని, అటువంటి పరిస్థితిని సృష్టించినందుకు భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మనం చంద్రుడిని మాత్రమే కాదు.. సూర్యుడిని కూడా చేరుకోబోతున్నాం. ఇది మన శాస్త్రవేత్తల ప్రతిభ  ” అని అన్నారామె. దేశంలోని అంతరిక్ష శాస్త్రవేత్తలను చూసి యువత నేర్చుకోవాలని గవర్నర్ (Governor) సూచించారు.

“దేశంలో చాలా రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇన్ని అలవాట్లు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి కానీ మనం ఐక్యంగా ఉండడం మన గర్వం. అదే బంధన రక్షా బంధన్‌. రక్షాబంధన్ అన్నాచెళ్లల్ల మధ్య అనురాగ అప్యాయతకు ప్రతీక ’’ అని  చెప్పింది. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ఎన్‌జీవో సంస్కృతి ఫౌండేషన్‌ను తమిళిసై (Tamilisai) అభినందించారు.

Also Read: Bhuvaneshwari: భువనేశ్వరి భావోద్వేగం, లోకేష్ పాదయాత్ర చేస్తుంటే కన్నీళ్లుపెట్టా!