Site icon HashtagU Telugu

Green India Challenge: చెట్లు నాటడం మాత్రమే.. వాటిని కాపాడుకుంటాం కూడా: సంతోష్ కుమార్

Green Challenge

Green Challenge

దేశమంతటా పచ్చదనం పెంపొదించేందుకు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ గ్రీన్ ఛాలెంజ్ లో వేలాదిమంది భాగస్వామలై మొక్కలను నాటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

తాజాగా వట ఫౌండేషన్ సాంకేతిక సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో శంషాబాద్ దగ్గర రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న 20 వృక్షాలను దిగ్గజ దర్శకుడు యస్.యస్.రాజమౌళి నల్గొండ ఫాంహౌజ్ లో, మరో 15 మొక్కలను వివిధ చోట్ల నాటారు. అనంతరం మాట్లాడిన జోగినిపల్లి సంతోష్ కుమార్.. ఒక్క మాట అడగగానే తన ఫాంహౌజ్ లో మొక్కలు నాటేందుకు అవకాశం కల్పించిన రాజమౌళి సహృదయతకు కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా వృక్షాలను రీలోకేట్ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. చెట్లు నాటడం మాత్రమే కాదు వాటిని కాపాడటంలోనూ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” చూపిస్తున్న అమితమైన చొరవపై ప్రకృతి ప్రేమికులు జోగినిపల్లి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము సైతం గ్రీన్ ఇండియాలో ఛాలెంజ్ కార్యక్రమానికి మెచ్చుకున్న విషయం తెలిసిందే.

Also Read: Ravichandran Ashwin: చెలరేగిన అశ్విన్.. అరుదైన రికార్డు సొంతం