Formula E-Car Race Case : ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు : కేటీఆర్‌ ట్వీట్‌

మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్‌ అన్నారు. ‘ఫార్ములా-ఈ ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్‌ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

Published By: HashtagU Telugu Desk
KTR To ED

KTR To ED

Formula E-Car Race Case : ఫార్ములా-ఈ కేసులో ED విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కేటీఆర్‌ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ నిర్వహించినప్పుడు ఇతరులు మన నగరాన్ని ప్రశంసిస్తుంటే గర్వంగా అనిపించింది. హైదరాబాద్‌ బ్రాండ్‌ను పెంచడమే నాకు ముఖ్యం. FEOకి ₹46cr బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. రాజకీయ కుట్రతో కేసు పెట్టారు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది. మా పోరాటాన్ని కొనసాగిస్తాం అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్‌ అన్నారు. ‘ఫార్ములా-ఈ ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్‌ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్‌ హైదరాబాద్‌ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోర్టు కేసుల విచారణ పేరుతో ఈ అంశాన్ని లాగుతున్నది. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయి. అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్‌.. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ నెల 7న విచారణకు కేటీఆర్‌ హాజరవాల్సి ఉన్నది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో.. తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు.

Read Also: KTR Vs ED : కేటీఆర్‌‌పై ప్రశ్నల వర్షం.. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. దూసుకొచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు

  Last Updated: 16 Jan 2025, 12:27 PM IST