Site icon HashtagU Telugu

Telangana: రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం, అభ్యర్థుల్లో టెన్సన్, టెన్షన్!

All Parties

All Parties

Telangana: తెలంగాణలో రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం ముగియనుంది. రేపటిలోగా ఫామ్-ఏ, ఫామ్‌-బీ సమర్పించాలని ఈసీ ఆదేశించిది. లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తిస్తామన్న ఈసీ తేల్చి చెప్పింది. బీఫామ్ రాకున్నా నామినేషన్ దాఖలు చేశారు కొందరు అభ్యర్థులు. దీంతో బీఫామ్ అందని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. హైదరాబాద్ జిల్లాలోని పలు ముఖ్యమైన పార్టీల అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఫలితంగా ఎంపికైన అభ్యర్థులు నామినేషన్ల స్వీకరణ చివరి నిమిషంలో ఆగ మేఘాలపై నామినేషన్లను సమర్పించాల్సిన పరిస్థితి నెలకొంది.

ముఖ్యంగా ఎప్పటికీ అభ్యర్థుల ఎంపిక సునాయాసంగా చేసుకునే మజ్లీస్ పార్టీకి సైతం ఈ సారి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో రెండు సీట్ల అభ్యర్థుల కోసం ఆ పార్టీ అధిష్టానం ఇంకా కసరత్తు కొనసాగిస్తుంది. జిల్లాలోని 15 సీట్లకు అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ఖరారు చేసిన అధికార బీఆర్ఎస్ పార్టీ మజ్లీస్ ప్రాతినిధ్యం వహించే సీట్లలో ముఖ్యమైన స్థానాలకు అభ్యర్థులను కాస్త ఆలస్యంగానే ప్రకటించే పరిస్థితులు తలెత్తాయి.

దీంతో పాలు పలు జిల్లాలోనే ఇదే పరిస్థితి నెలకొనడంతో అటు పార్టీల్లో, ఇటు అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న‌ బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఆయనతో పాటు ముఖ్యనేతలు కూడా నామినేషన్ వేశారు.