Site icon HashtagU Telugu

Munugode By-poll: నేటి నుంచి మునుగోడు పోరుకు నామినేషన్లు…వారికి కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్..!

Munugode

Munugode

తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. గతకొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. అయితే మునుగోడుకు ఉపఎన్నిక ప్రక్రియ ఇవాళ్టి నుంచి షురూ కానుంది. ఇవాళ్టి నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. దీనికోసం చండూరులో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చండూరులోని ఎమ్మార్వో ఆఫీసులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరక నామినినేషన్లు సమర్పించవచ్చు. ఈనెల 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న పత్రాలను పరిశీలిస్తారు. 17 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. రెండ శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. నవంబర్ 3న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6వ తేదీని ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.

కాగా నామినేషన్ ప్రక్రియ మొదలవ్వడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ప్రధాన పార్టీల నేతలంతా మునుగోడుకు వెళ్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఉపఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా మునుగోడుకు పయనమవుతున్నారు. 2,500ఓటర్లకు ఒక ఎమ్మెల్యే చొప్పున మొత్తం 86మంది ఎమ్మెల్యేలను మునుగోడు బరిలోకి దింపుతోంది అధిష్టానం. ఈ ఉపఎన్నిక బాధ్యతను మంత్రివర్గానికి అప్పగించింది. కేటీఆర్, హారీశ్ రావు మానిటరింగ్ చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు నేతలంతా మునుగోడు చేరుకోవాలని టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పోలింగ్ కు మూడు రోజుల వరకు అక్కడే ఉండాలని..ఇంటింటికీ ప్రచారం చేయాలని స్పష్టం చేసింది.