Jagadeeshwar Goud: ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ జాబితాలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. శేరిలింగంపల్లి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం నామినేషన్ కు ఆఖరు తేదీ కావడంతో జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లారు. దీంతో అభిమానులు, కార్యకర్తల నినాదాలతో శేరిలింగంపల్లి మార్మోగింది. ముఖ్య నేతలతో కలిసి ఆయన నామినేషన్ ను దాఖలు చేశారు.
గతంలో బీఆర్ఎస్ మాదాపూర్ కార్పొరేటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు ఆకర్షితులై హస్తంగూటికి చేరుకున్నారు. జగదీశ్వర్ గౌడ్ చేరికతో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంది. గత నెలరోజులుగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకున్నది. మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులతో కలిసి పార్టి అభ్యర్థి వి. జగదీశ్వర్ గౌడ్ కుమార్తె వి. హారికా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.