Site icon HashtagU Telugu

TS: తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు వద్దు…కేంద్రానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం..!!

New High Court

ఏపీకి విద్యుత్ బకాయిలను చెల్లించే విషయంపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ కు మొత్తం రూ. 6,756,92కోట్లను 30 రోజుల్లో చెల్లించాలంటూ ఆగస్టు 29న కేంద్రం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్…రాష్ట్ర విద్యుత్ సంస్థలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

ఈ పిటిషన్లపై జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యుత్ సంస్థల వాదనను వినకుండా ఏకపక్షంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం ప్రాథమిక చట్ట ఉల్లంఘటన అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారానికి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతోపాటుగా ఏపీ సర్కార్, ఏపీ విద్యుత్ సంస్థలను ఆదేశించింది. ఈ విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేసింది హైకోర్టు.