Site icon HashtagU Telugu

Nizamabad Govt Hospital: అమానుషం.. స్ట్రెచర్ లేక రోగి కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు!

Nijamabad

Nijamabad

ఒకవైపు తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంటే, మరోవైపు కనీస వసతులు, నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కూర్చోడానికి కుర్చీలు, విశ్రాంతి తీసుకోవడానికి బెడ్స్, రోగిని తరలించడానికి స్ట్రెచర్స్ (Stretcher) లేక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని బంధువులు కాళ్లు (Legs) పట్టుకుని నేలపై లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ (Video Viral)గా మారింది.

గత నెల 31న సాయంత్రం ఓ రోగిని అతని బంధువులు అస్పత్రికి తీసుకొచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. అయితే ఓపీ మధ్యాహ్నం వరకు మాత్రమే ఉండటంతో ఆ రోజు కుదరలేదు. దీంతో రాత్రంతా అక్కడే ఉండిపోయారు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తరువాత.. బంధువులు ఓపీ రిజిస్టర్ చేయించారు.

దీంతో రెండో అంతస్తులోని డాక్టర్ (Doctor) దగ్గరకు వెళ్లాలని సూచించారు. అయితే ఆ వ్యక్తిని లిఫ్ట్ వరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ అవసరం పడింది. కానీ స్ట్రెచర్ (Stretcher) అందుబాటులో లేకపోవటంతో బంధువులు అతని కాళ్లు పట్టుకుని నేలపైనే లాక్కెళ్లారు. అయితే రోగిని రెండో అంతస్తుకు తీసుకెళ్లాక అక్కడ కూడా స్ట్రెచర్, వీల్‌చైర్ కనిపించలేదు. దీంతో మళ్లీ కాళ్లు పట్టుకుని నేలపైనే డాక్టర్ రూమ్ దగ్గరకు లాక్కెళ్లారు. డాక్టర్ల తీరు, సిబ్బంది నిర్లక్ష్యంపై రోగులు మండిపడుతున్నారు. అయితే ఆ ఘటన ఆలస్యంగా వెలుగుచూడటం గమనార్హం.

ఆస్పత్రి సూపరింటెండెంట్ వివరణ

కాగా ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఈ మేరకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఉన్నా, స్ట్రెక్చర్స్ అందుబాటులో ఉన్నా ఈడ్చుకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఆస్పత్రిలో వీల్ చైర్స్, స్ట్రెచర్స్ కొరత లేదని ఆమె స్పష్టం చేశారు.

Also Read: 3 Died: మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 3 మృతి!

Exit mobile version