Site icon HashtagU Telugu

Telangana Border: స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో ఓమిక్రాన్ టెన్ష‌న్‌…

తెలంగాణ స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర , క‌ర్ణాట‌క ల‌లో ఒమిక్రాన్ కేసులు నమోదైయ్యాయి.ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాలు ఆప్ర‌మ‌త్త‌మైయ్యాయి. కానీ ఈ రాష్ట్రాల‌కు స‌రిహ‌ద్దుల్లో ఉన్న తెలంగాణ మాత్రం ఇంకా ఎలాంటి చ‌ర్య‌లు ప్రారంభించ‌లేదు. స‌రిహ‌ద్దు ప్రాంతాల రాష్ట్రాల‌కు ప్ర‌తిరోజు వంద‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు వ‌చ్చి పోతుంటారు. దీంతో ఈ వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ముప్పుని నివారించడానికి ఎలాంటి చ‌ర్య‌లు ప్రారంభింలేదు.

ముఖ్యంగా టీఎస్ఆర్టీసీ హైద‌రాబాద్ నుంచి క‌ర్ణాట‌క, మ‌హారాష్ట్ర‌ల‌కు ప్ర‌తిరోజు 300 బ‌స్సుల‌ను న‌డుపుతోంది.ఆ రాష్ట్రాల నుంచి తెలంగాణ‌కు రోజుకు వంద‌ల మంది ప్ర‌యాణికులు వ‌స్తుంటారు. దీంతో తెలంగాణ‌కు కూడా ఓమిక్రాన్ వైర‌స్ వ్యాప్తి ఉంటుంద‌ని భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు ఉన్నారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆర్టీఏకి కానీ, ఆర్టీసీకి కానీ రాక‌పోక‌ల‌పై ఎలాంటి ఆదేశాలు అంద‌లేద‌ని అధికారులు అంటున్నారు.

క‌రోనా మొద‌టి, రెండు ద‌శ‌ల్లో వైర‌స్ ని అరిక‌ట్టేందుకు లాక్ డౌన్ తో పాటు అంత‌రాష్ట్ర ర‌వాణాపై ప్ర‌భుత్వం క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించింది. స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రోసిజ‌ర్ లో భాగంగా వైద్య ఆరోగ్య‌శాఖ‌, పోలీస్‌, రెవెన్యూ వంటి విభాగాలు ఆర్టీఏ తో క‌లిసి ఇత‌ర రాష్ట్రాల నుంచి వాహ‌న రాక‌పోక‌లను నియంత్రించారు.
కాన ఓమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి వాహ‌న త‌నిఖీల‌పై ఎలాంటి సూచ‌న‌లు అందలేద‌ని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ మరియు గోవాతో సహా కొన్ని రాష్ట్రాలు ఓమిక్రాన్ వైర‌స్ వ్యాప్తిని నివారించ‌డానికి ఇప్ప‌టికే చ‌ర్య‌లు ప్రారంభించాయి. ఉత్తరాఖండ్ స‌రిహ‌ద్దుల్లో కోవిడ్ టెస్ట్ ల సంఖ్య‌ను పెంచ‌గా…మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌యాణికుల రాక‌పోక‌ల‌పై నిఘా పెంచింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారిని ఐదు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాల‌ని గోవా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

టీఎస్ఆర్టీసీ లాక్ డౌన్ స‌మ‌యంలో భారీ న‌ష్టాల‌ను చవిచూసింది.దీంతో ఇప్పుడు మ‌ళ్లీ రవాణాపై ఆంక్ష‌లు విధిస్తే ఆర్టీసీకి మ‌రింత న‌ష్టం జ‌రుగుతుంద‌నే భావ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. కానీ ఓమిక్రాన్ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అంత‌రాష్ట్ర స‌ర్వీసుల‌పై ఆంక్ష‌లు విధించ‌క‌పోతే ఎక్కువ మంది వైర‌స్ బారిన ప‌డే అవ‌కాశం ఉంది. మ‌రి కొత్త వేరియంట్ ని నియంత్రించ‌డానికి టీఎస్ స‌ర్కార్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి