Telangana: ఎమ్మెల్యే, మంత్రులకు ఇకపై పోలీస్ సెల్యూట్ ఉండదు

తెలంగాణ లో ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులోకి రావడంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవారికి లభించే కొన్ని గౌరవాలు నిలిచిపోయాయి.

Telangana: తెలంగాణ లో ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులోకి రావడంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవారికి లభించే కొన్ని గౌరవాలు నిలిచిపోయాయి. అందులో భాగంగా పోలీసులు ఎమ్మెల్యే, మంత్రులకు సెల్యూట్ చేసే అవకాశం ఉండదు. వాళ్ళకి పోలీసుల నుంచి ఎలాంటి ప్రోటోకాల్ కూడా ఉండదు.

51 రోజుల పాటు రాజ్యాంగ బద్దంగా లభించే గౌరవ పోలీసు సెల్యూట్, ప్రోటోకాల్ వారికి లభించదు. తిరిగి వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే పోలీసుల నుంచి వారికీ ప్రోటోకాల్ ని కేటాయిస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోకి రావడంతో ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ ప్రోటోకాల్, పోలీసు సెల్యూట్ కు దూరం అయ్యారు. ఖ్యమంత్రికి కూడా కోడ్ నిబంధనలు వర్తిస్తాయి.

తెలంగాణలో నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. 3వ తేదీ నుండి పదవ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 30 వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్, అదే రోజు ఫలితాలు విడుదల అవుతాయి.

Also Read: Telangana: తెలంగాణలో భారీగా డబ్బు, మద్యం, బంగారం స్వాధీనం