Bandi Sanjay Padayatra: బండి సంజయ్ పాదయాత్రకు ‘నో పర్మిషన్’

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 01:25 AM IST

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే. నాలుగు దశలుగా నిర్వహించిన పాదయాత్రకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఐదో దశ యాత్రకు శ్రీకారం చుట్టారాయన. నిర్మల్ జిల్లాలో తన యాత్రను ప్రారంభించాలని సంకల్పించారు. అయితే సోమవారం ప్రారంభం కాబోతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పోలీస్ పర్మిషన్ లేదు. వరంగల్లో నెలకొన్న ఉధృత పరిస్థితుల నేపథ్యంలో నిర్మల్ బైంసా ఏరియాలో మత ఘర్షణలు జరిగే ఛాన్స్ ఉన్నందున బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించినట్టు సమాచారం.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత చివరి క్షణంలో అనుమతి లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ వస్తున్నారని సమాచారం పోలీసులకు పంపామని, దగ్గరుండి సభ ఏర్పాట్లు పర్యవేక్షించి యూటర్న్ తీసుకుంటారా? అని మండిపడ్డారు. బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాక హఠాత్తుగా అనుమతి లేదంటారా అని బండి అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఎం కావాలి అని బండి ఘాటు గా రియాక్ట్ అయ్యారు.