Site icon HashtagU Telugu

CM Revanth: డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచనని చంపేస్తా: సీఎం రేవంత్

Cm Revanth

Cm Revanth

CM Revanth: తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందుకోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేశామని, తెలంగాణ నుంచి డ్రగ్స్‌ నిర్మూలనే తన లక్ష్యమని చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “డ్రగ్స్ మరియు రైతుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతున్నదని సీఎం రేవంత్ అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిరవేరుస్తున్నదన్నారు. రైతు రుణాలు మాఫీ అయ్యాయి అని చెప్పారు సీఎం రేవంత్. అలాగే డ్రగ్స్ తీసుకోవాలన్న ఆలోచనని కూడా పోగొడతానని స్పష్టం చేశారు సీఎం రేవంత్. దీంతో పాటు రాష్ట్రంలో యువతకు అవకాశాలపై ఆయన మాట్లాడారు. పరిశ్రమ ఆధారిత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించే విశ్వవిద్యాలయానికి తమ ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి చెప్పారు. యువతలో నిరుద్యోగం మరియు అన్ని రకాల వ్యసనాలను నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. తెలంగాణలో డ్రగ్స్ గురించి ఎవరూ కలలు కనే సాహసం చేయకూడదని సీఎం వ్యాఖ్యానించారు.

శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి భ్రమ్మ కుమారీలను అభినందించారు. సంస్థ కోసం లీజు పునరుద్ధరణను తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.

Also Read: Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీ: పీకే సంచలన నిర్ణయం