Site icon HashtagU Telugu

Ram Mandir: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం రాలేదు: కవిత

Ram Mandir

Ram Mandir

Ram Mandir: అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం రాలేదని బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల అన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు బీఆర్ఎస్ పార్టీకి అధికారిక ఆహ్వానం రాలేదు, కానీ శ్రీరాముడు అందరి కోసం అన్నట్లుగా మేము చివరికి ఏదో ఒక రోజు రామమందిరాన్ని సందర్శిస్తాము అని ఆమె వ్యాఖ్యానించారు.

జనవరి 22న జరగనున్న రామమందిరం కార్యక్రమానికి హాజరుకావడానికి పలు రాజకీయ పార్టీలు నిరాకరించాయి. అయితే వారి నిర్ణయానికి వివిధ రాజకీయ కారణాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఈ కార్యక్రమం హడావిడిగా నిర్వహించబడుతుందని మరియు ఈ కార్యక్రమం కేవలం రాజకీయ లబ్ది కోసమేనని బీజేపీపై ఆరోపిస్తుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) ఈ కార్యక్రమాన్ని బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న కార్యక్రమంగా భావిస్తున్నాయి.

తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించింది. పార్టీ అధినేత మమతా బెనర్జీ రామమందిరాన్ని “రాజకీయ జిమ్మిక్” అని అభివర్ణించారు. మరోవైపు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 22న ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ‘హాఫ్ డే’ సెలవు ప్రకటించాయి. బ్యాంకులు కూడా సోమవారం ‘హాఫ్ డే’ సెలవును పాటిస్తాయి.

Also Read: Hanu-Man: అయోధ్యకు హనుమాన్ టీం ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా