Site icon HashtagU Telugu

Israel-Hamas War: ఏ యుద్ధమైన తొలిగాయం త‌ల్లికే..

Israel Hamas War (4)

Israel Hamas War (4)

Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఇరువురి మధ్య కొనసాగుతున్న భీకర పోరు సంక్షోభానికి దారి తీస్తుంది. మధ్యలో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పోరు ప్రాణాల్ని బలి తీసుకుంటుంది. సమాచారం ప్రకారం ఈ యుద్ధం కారణంగా 8 వేలకు పైగానే మరణించినట్లు తెలుస్తుంది.

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. పాలస్తీనాలోని గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేసిన కవిత.. విపత్కర పరిస్థితులకు శాంతియుత పరిష్కారం లభించాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, యుద్ధం ఏదైనా సరే.. బాధితుల్లో ముందు మహిళలు, చిన్నారులే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్దంలో ఎవ‌రు మ‌ర‌ణించినా, గాయ‌ప‌డిన ఆ శోకం త‌ల్లికేనని చెప్పారు. యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభం వీలైనంత త్వరగా తొలగిపోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గాజాలో జరుగుతున్న మానవతా సంక్షోభం పట్ల నేను చాలా బాధపడ్డాను అని కవిత పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ దళాలచే బాంబు దాడులు తీవ్రమయ్యాయి. ఉత్తర గాజా నేలమట్టం అవుతోంది. ఈ క్రమంలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాలో మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ మరణాలను నివారించడానికి మరియు నిర్విరామంగా అవసరమైన మానవతా సామాగ్రిని అందించేందుకు ఇతర దేశాలు ముందుకొస్తున్నారు. మరోవైపు సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గాజా కాల్పుల విరమణకు పిలుపునిచ్చే నాన్ బైండింగ్ తీర్మానాన్ని ఆమోదించింది. జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 120 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 14 ఓట్లు రాగా, 45 మంది గైర్హాజరయ్యారు.

Also Read: Amala Paul Lip Lock : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన అమలా పాల్ ఘాటైన ‘ముద్దు’