Site icon HashtagU Telugu

ALERT: ఇక ఫై ఆ యాప్స్ నుండి కరెంట్ బిల్లులు కట్టకూడదు – TGSPDCL

Phone Pay Power Bill

Phone Pay Power Bill

ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు నడుస్తున్నాయి. ప్రతిదీ ఆన్లైన్ లోనే నడుస్తుంది. లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు ఏంకావాలన్న..ఏంచేయాలన్న అన్ని ఆన్లైన్ లోనే చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇంటి కరెంట్ బిల్లు కూడా ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. అయితే ఇకపై అలాంటి యాప్స్ తో చెల్లింపులు జరపకూడదని ప్రకటించింది TGSPDCL .

RBI ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈక్రమంలో నేటి నుంచి TGSPDCL వెబ్సైట్/ మొబైల్ యాప్ ద్వారానే నెలవారీ కరెంట్ బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది. నిన్నటి వరకు ప్రవైట్ యాప్స్ అలవాటు పడ్డ వినియోగదారులు ఇప్పుడు TGSPDCL ద్వారా ఎంత వరకు చెల్లింపులు చేస్తారనేది చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇటీవల TGSPDCL అనేక మార్పులు చేర్పులు చేస్తుంది.ఈ మధ్య నెలవారీ కరెంట్ బిల్లు ను చెక్ చేసుకునే వెసులుపాటు కల్పించింది. డిస్కం వెబ్ సైట్ లో డిజిటల్‌ కాలిక్యులేటర్‌ ఆప్షన్ ను తీసుకొచ్చారు. ఈ సదుపాయాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకుని అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

డొమెస్టిక్​ కస్టమర్స్​ కరెంటు వాడకం బిల్లు చెక్​ చేసుకునేందుకు ఈ ఆప్షన్ పని చేస్తుంది. ఇందుకోసం వినియోగదారులు ​https://tgsouthernpower.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇందులో ఎనర్జీ చార్జెస్​ క్యాలిక్యూలేటర్​ ఫర్​ డొమెస్టిక్​ సర్వీస్​ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి… మీటర్ రీడింగ్ వివరాలను ఎంట్రీ చేస్తే మీ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు డిస్ ప్లే అవుతాయి.

ఎన్ని రోజులకు బిల్లింగ్ అయింది..? రీడింగ్ తీసిన తేదీలను సరిపొల్చుకోవచ్చు. ఫలితంగా నమోదైన కరెంట్ బిల్లు సరైనదేనా లేదా అనే దానిపై అంచనాకు రావొచ్చు. యూనిట్ల వివరాలను కాలిక్యులేటర్‌లో నమోదుచేస్తే బిల్లింగ్‌ రోజులు, ఎంత ఛార్జీ వేశారనే వివరాలు కూడా తెలుస్తాయని TGSPDCL సీఎండీ తెలిపారు.

Read Also : Offer to Prisoners : ఖైదీలకు బంపర్ ఆఫర్.. ఆ ఒక్కటీ ఒప్పుకుంటే రిలీజ్!