Tamilisai Vs Kcr : సీఎం కేసీఆర్ సర్కారుపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌గా తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేదని.. తాను వచ్చాక ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించానన్నారు. తాను రావడంతో ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం రావడం సంతోషం అని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తన పనిని తాను చేసుకుంటూ ముందుకుసాగుతానని స్పష్టం చేశారు. ఎంత అవమానించినా వెనక్కి తగ్గబోనని గవర్నర్ తమిళిసై తేల్చిచెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
Also read : M. S. Swaminathan: స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
‘‘నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు. రాళ్లు వేసే వారు కూడా ఉన్నారు. అందరూ అందరికీ నచ్చాలని లేదు. అయితే మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలి. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను. నాపై రాళ్లు విసిరితే ఇల్లు కట్టుకుంటా.. పిన్స్ వేస్తే ఆ పిన్స్ గుచ్చుకొని వచ్చే రక్తంతో నా చరిత్ర పుస్తకం రాస్తా’’ అంటూ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. లోక్‌సభ, శాసనసభలో 33% మహిళా రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి (Tamilisai Vs Kcr) కృతజ్ఞతలు తెలిపారు.