Site icon HashtagU Telugu

CM KCR: ‘ముందస్తు’పై కేసీఆర్ క్లారిటీ!

Kcr55

Kcr55

గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ తాజాగా కేసీఆర్ ముందస్తుపై స్పందిస్తూ.. తెలంగాణకు తాను చేయాల్సి చాలా ఉందనీ, ముందస్తు ఆలోచన లేదని తేల్చి చెప్పారు. విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానమిస్తూ, అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికల ప్రశ్నే లేదని అన్నారు. “నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. నేనెందుకు ముందస్తు ఎన్నికలకు వెళతాను అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం అసెంబ్లీకి డిసెంబర్ 2023 వరకు సమయం ఉందని గుర్తు చేశారు.

అయితే రాష్ట్రంలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని, ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చాయని చెప్పారు. 30 మందిలో టీఆర్‌ఎస్‌ 29 మంది గెలుస్తారని స్పష్టమైందని, ఈ రేటు ప్రకారం.. 119 సభ్యుల అసెంబ్లీలో పార్టీ 95, 105 స్థానాల మధ్య ఎక్కడైనా గెలుస్తుంది ”అని ఆయన చెప్పారు. పాదయాత్రలపై తనకు అంతగా ఆసక్తి లేదని అన్నారు. “పాదయాత్రలు పాత విధానమని,  ఇప్పుడు పాదయాత్రలు చేయడం వల్ల వచ్చే లాభాలేమీ లేవు. నేను పాదయాత్ర చేయను ”అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో బిజెపి అధ్యక్షుడు సంజయ్ కుమార్ చేయబోయే పాదయాత్రపై మాత్రం కేసీఆర్ హేళన చేశారు.