Site icon HashtagU Telugu

Rajasingh & Etela: సస్పెన్షన్‌పై ఈటలతో చర్చించలేదు : ఎమ్మెల్యే రాజాసింగ్

Rajasingh

Rajasingh

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావును ప్రత్యేకంగా కలిసిన విషయం తెలిసిందే. హరీశ్, రాజాసింగ్ భేటీ రెండు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాజాసింగ్ బీఆర్ఎస్ లో చేరుతారంటూ వార్తలు వినిపించగా, రాజాసింగ్ మాత్రం నియోజకవర్గ అభివ్రుద్ధి పనుల కోసం కలిశాననని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో సమావేశమయ్యారు.

గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు, కార్పోరేటర్‌పై అధికార బీఆర్ఎస్ తప్పుడు కేసులు బనాయించిందని, ఈ విషయాన్ని తాము తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకు వెళ్లామని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఈటల కార్యకర్తలు, కార్పోరేటర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారన్నారు.

తన సస్పెన్షన్ గురించి ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. కానీ అంతకుముందు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు మాత్రం కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారని తెలిపారు. మాజీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాజాసింగ్ పై నిషేధం ఎత్తివేయడానికి గట్టిగా ప్రయత్నించారు.అయితే అనేక సమీకరణాల నడుమ ఆయన మాజీ కావడంతో ఆ ప్రయత్నాలు అక్కడే ఆగిపోయినట్లుగా తెలుస్తుంది . మరి రాజసింగ్ రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీతో కొనసాగుతుందో మరి కొద్ది రోజుల్లో ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది.

Also Read: NTR’s Gift: రామ్ చరణ్ కూతురు క్లీంకారకు ఎన్టీఆర్ స్పెషల్ గిప్ట్!