Union Budget 2024-25 : తెలంగాణకు మరోసారి కేంద్రం ‘0’ బడ్జెట్ – కేటీఆర్

16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి

  • Written By:
  • Updated On - July 23, 2024 / 03:33 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టగా..ఈ బడ్జెట్ ఫై తెలంగాణ ప్రజలు , పలు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తెలంగాణ (Telangana) ప్రజలకు కేంద్రం మొండిచేయి చూపించిందని మండిపడుతున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman) ప్రకటించిన బడ్జెట్ 2024-25లో (Union Budget) తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్తో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. కానీ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసేఎత్తకపోవడం ఫై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు భారీగా ఓట్లేసి గెలిపించిన సంగతి తెలిసిందే. ఈసారి నార్త్ ఇండియాలో బీజేపీకి సీట్లు తగ్గినా తెలంగాణలో అధికార కాంగ్రెస్తో సమానంగా ఆ పార్టీకి 8 సీట్లు కట్టబెట్టారు. దీంతో ఈసారి బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు వస్తాయని అంతా అంచనా వేశారు. కానీ కేంద్రం ఆ ఊసే ఎత్తకపోవడం ఫై తెలంగాణ అంటే బిజెపికి ఎంత ప్రేమ ఉందొ అర్ధం అవుతుందని వాపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో మొండి చెయ్యి ఇచ్చాయని బిఆర్ఎస్ విమర్శించింది. ‘కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు స్థానిక పార్టీల మద్దతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కెసిఆర్ ఎప్పుడూ చెప్పేవారు. 16 మంది ఎంపీలతో టీడీపీ, 12 మంది ఎంపీలతో JDU భారీగా కేటాయింపులు సాధించాయి. తెలంగాణ సొంత పార్టీకి 12-15 మంది ఎంపీలు ఉండుంటే ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు వచ్చుండేవి’ అని ట్వీట్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని పేర్కొన్నారు. ములుగు యూనివర్సిటీకి అదనపునిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదు ఈసారి కూడా అదేచేసారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ బ‌డ్జెట్ తెలియజేస్తోంద‌న్నారు.

Read Also ;

Follow us