Site icon HashtagU Telugu

Telangana BSP: బహుజన బలగంతో ఒంటరిగా పోటీ చేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్

Rs Praveen Kumar

Rs Praveen Kumar

తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ 2023 చివరిలో జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారనే పుకార్లను కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చి పొత్తులపై ఆయన (RS Praveen Kumar) క్లారిటీ ఇచ్చారు.

“తెలంగాణలో పొత్తు గురించి నేను తెలంగాణ స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో చర్చించినట్లు చాలా హిందీ పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఇది ఫేక్ న్యూస్. మేం ఏ కాంగ్రెస్‌ నేతలతోనూ ఎన్నికల గురించి చర్చించలేదు. తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ రంగంలో మా ప్రతి అడుగు మరియు లక్ష్యం మా జాతీయ అధ్యక్షురాలు గౌరవనీయులైన బెహెన్‌జీ మాయవతి ఆదేశాల మేరకు ఉంటుంది. ఇది నిజం. జై భీమ్” అంటూ హిందీలో ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ ప్రభావంపై కాంగ్రెస్ అప్రమత్తంగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
హైదరాబాద్ నడిబొడ్డున, కొత్తగా నిర్మించిన సచివాలయం పక్కనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా కేసీఆర్ దళితులపై గాలం వేస్తున్నారని, బీసీ రాజకీయాలతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆయన అన్నారు. 2023 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆర్ఎస్ తేల్చి చెప్పారు.