నిజామాబాద్: జిల్లా న్యాయసేవా, జిల్లా యంత్రాంగం, న్యాయశాఖ సంయుక్తంగా ఆదివారం మహిళలకు నిర్వహించిన ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో 11 వేల మంది ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు విజయవంతంగా కార్యక్రమాన్ని వీక్షించారు. శిక్షణ తరగతులు పూర్తయిన తర్వాత జిల్లా జడ్జి సునీత కుంచాల అవార్డుకు సంబంధించి ప్రకటన చేశారు.
శిక్షణా కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలకు చెందిన ఉన్నత పాఠశాల బాలికలు, న్యాయ, అటవీ, వైద్య, పోలీసు తదితర శాఖల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తైక్వాండో శిక్షకుడు మనోజ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ.. ఆత్మరక్షణ శిక్షణలో పాల్గొన్న విద్యార్థినులు, యువతులకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎంట్రీని అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల పట్టుదల, కృషి వల్లనే ఇది సాధ్యమైందని ఆమె అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కమీషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ శింగేనవర్ మాట్లాడుతూ.. ఆత్మరక్షణ మెళకువలు నేర్చుకున్న వారు కనీసం పది మందికి నేర్పించాలని సూచించారు. “మీరు శిక్షణను ఆపకూడదు. దాన్ని కొనసాగించి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి’’ అని సలహా ఇచ్చారు.
ఈ రికార్డ్-సెట్టింగ్ ఈవెంట్ పాల్గొనేవారి విజయాలను జరుపుకోవడమే కాకుండా, మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించడంలో స్వీయ-రక్షణ శిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, భవిష్యత్ తరాలకు కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించడం ద్వారా, ఈ కార్యక్రమం జాతీయ గుర్తింపును సాధించడమే కాకుండా నిజామాబాద్‌లో మహిళల సాధికారత కోసం సమిష్టి కృషిని గుర్తించింది. ఈ చొరవ మహిళల భద్రత కోసం ఉద్యమంలో ఒక ముఖ్యమైన ముందడుగును ప్రతిబింబిస్తుంది మరియు దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలకు స్ఫూర్తిదాయకమైన నమూనాగా నిలుస్తుంది.
Read Also : Vizag Steel Plant : ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ర్యాలీ