నిరుద్యోగ చైతన్య బస్సుయాత్ర (Nirudyoga Chaithanya Yatra)కు ఎన్నికల కమిషన్ (Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో..ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్‌పార్క్ వద్ద ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరామ్, రియాజ్, ఆకునురి మురళి.. జెండా ఊపి చైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రకు నిరుద్యోగులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇక.. నేటి నుంచి ఈ నెల 25 వరకు 10 రోజుల పాటు తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఈ నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
నిరుద్యోగ చైతన్య యాత్ర కోసం 2 బస్సుల ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు 50 నియోజకవర్గాలు తిరగనుంది. ఒక బస్సు ఉత్తర తెలంగాణ, రెండోది దక్షిణ తెలంగాణకు వెళుతుంది. రోజుకు ఒక్కో బస్సు 5 నియోజకవర్గాలు తిరుగుతుంది. 10 రోజులు 100 నియోజకవర్గాల్లో తిరిగేలా కార్యాచరణ రూపొందించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొననున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు కదలని పరిస్థితి. దీంతో ఏండ్ల తరబడి ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించేందుకు తెలంగాణ నిరుద్యోగులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రకు నిరుద్యోగులు శ్రీకారం చుట్టారు.
Read Also : Ganta Srinivasa Rao : ఈ ఒక్క ఫోటో చాలు..జగన్ చేసిన గణకార్యాల చెప్పడానికి – గంటా ట్వీట్