Site icon HashtagU Telugu

Srihari Rao : బిఆర్‌ఎస్ కు మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత.. కాంగ్రెస్ లోకి జంప్..

Nirmal District Senior Leader Srinivasa Rao resigned to BRS and joining in Congress

Nirmal District Senior Leader Srinivasa Rao resigned to BRS and joining in Congress

తెలంగాణ(Telangana)లో ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక(Karnataka) ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్(Congress) మరింత పుంజుకొని వేరే పార్టీల్లోని అసంతృప్త నేతలను, పాత కాంగ్రెస్ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ ఇటీవల వేగంగా పనిచేస్తుంది.

ఇక అధికార పార్టీ BRSకు వరుస షాక్ లు తగులుతున్నాయి. బిఆర్‌ఎస్ లోని అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కి క్యూ కడుతున్నారు. తాజాగా మరో సీనియర్ నేత బిఆర్‌ఎస్ కి రాజీనామా చేశారు. నిర్మల్(Nirmal) జిల్లా సీనియర్ నేత శ్రీహరి రావు(Srihari Rao) పార్టీకి నేడు రాజీనామా చేశారు. కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అనంతరం తన నిర్భయం వెల్లడించారు.

ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి శ్రీహరి రావు మాట్లాడుతూ.. నిర్మల్ లో పార్టీ పరిస్థితిని అధిష్టానానికి ఎన్ని సార్లు చెప్పినా అధిష్టానం పెడచెవిన పెట్టింది. చారిత్రక తప్పిదం జరగొద్దని ఏడాదిగా మౌనంగానే ఉన్నాను. ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలని సూచిస్తే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టించుకోలేదు. నాకు సమాచారం ఇవ్వకుండా నా సొంత ఊర్లో కార్యక్రమాలు నిర్వహించారు. పాత టి.ఆర్.ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులను ఇంద్రకరణ్ రెడ్డి కలుపుకొని పోలేదు. టి.ఆర్.ఎస్ నిర్మాణంలో 2007 నుండి చాలా కష్టపడ్డాను. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేటంతో పాటు పెద్ద నాయకులు చేరేలా ఎంతో కృషి చేశాను. 2018లో ఇంద్రకరణ్ రెడ్డి కోసం టికెట్ త్యాగం చేస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మోసం చేశారు. అప్పుడు టికెట్ వదులుకొని తప్పు చేశాను అని అన్నారు.

తాను కాంగ్రెస్ లో చేరే దాని గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో చేరాలని అభిమానులు సూచించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను బలపర్చాల్సి ఉంది. కాంగ్రెస్ లో చేరే తేదీని త్వరలోనే ప్రకటిస్తాను అని అన్నారు. అయితే కాంగ్రెస్ లో నిర్మల్ MLA టికెట్ ఆశిస్తున్నారు శ్రీనివాస్ రావు. BRSకు రాజీనామాతో పాటు బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. దీంతో నిర్మల్ జిల్లాలో BRS కి భారీ షాక్ తగిలింది.

 

Also Read : TPCC President Revanth Reddy : ష‌ర్మిలపై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అది అదిష్టానం నిర్ణ‌య‌మా? రేవంత్ వ్య‌క్తిగ‌త‌మా..