congress: కాంగ్రెస్‌లో చేరిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేత విఠల్ రెడ్డి

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 03:08 PM IST

 

Former MLA Gaddigari Vittal Reddy : తెలంగాణలో బీఆర్ఎస్(brs) పార్టీ నేతలు అధికార పార్టీ కాంగ్రెస్‌(congress)లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్దిరోజులుగా ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి(Vittal Reddy) కాంగ్రెస్ మంత్రులతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో విఠల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఇంద్రకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు విస్తృతప్రచారం జరుగుతుంది. అయితే, ప్రస్తుతానికి మాజీ మంత్రి కాంగ్రెస్ లో చేరికకు బ్రేక్ పడినట్లు సమాచారం. ఇంద్రకరణ్ రెడ్డి చేరికను జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారట. ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని ఇటీవల చాలా మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో అధిష్టానంసైతం ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం.

read also: APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు

ముధోల్ నియోజకవర్గం నుంచి విఠల్ రెడ్డి రెండుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన విఠల్ రెడ్డి.. కొద్దికాలానికే కాంగ్రెస్ ను వీడి అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి మరోసారి విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.