Telangana : తెలంగాణలో బీజేపీకి షాక్‌.. బీఆర్ఎస్‌లో చేరిన తొమ్మిది మంది నిజామాబాద్ నేత‌లు

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుంటంతో పార్టీల్లో వ‌ల‌స‌లు జోరందుకున్నాయి. అధికార పార్టీ నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీలోకి..

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 11:54 PM IST

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుంటంతో పార్టీల్లో వ‌ల‌స‌లు జోరందుకున్నాయి. అధికార పార్టీ నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీలోకి.. ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఈ వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ‌వారంతా పార్టీలు మారుతున్నారు. తాజాగా తెలంగాణ‌లో బీజేపీ ఆ పార్టీ నేత‌లు షాక్ ఇచ్చారు. నిజామాబాద్‌లో తొమ్మిది మంది బీజేపీ నేత‌లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా మల్లాపూర్ గ్రామానికి చెందిన తొమ్మిది మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, సిరికొండ మండలానికి చెందిన పలువురు సభ్యులు ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలో చేరారు.టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో వారంతా పార్టీలో చేరారు.వారికి కండువా క‌ప్పి ఆయ‌న పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని గ్రహించి చాలా మంది బీఆర్‌ఎస్‌లో చేరారని బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్ రెడ్డి తెలిపారు. BRS మాత్రమే గ్రౌండ్ లెవెల్లో ప్రజల అవసరాలను తీర్చగలదని.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలదని నమ్ముతున్నందున తాము బీజేపీని విడిచిపెట్టినట్లు పార్టీలో చేరిన వారు తెలిపారు.