Site icon HashtagU Telugu

Night club Hyderabad: హైదరాబాద్ పబ్ లో గబ్బు పనులు.. వన్యప్రాణులతో వింత చేష్టలు!

Pub

Pub

హైదరాబాద్‌ (Hyderabad) జూబ్లీహల్స్‌లోని ఓ పబ్‌లో వన్యప్రాణులు దర్శనమిచ్చాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-36/10లోని ఆ పబ్‌లో వీకెండ్స్ పార్టీలో ఇవి దర్శనమివ్వడంతో కొందరు వ్యక్తులు.. వాటి ఫొటోలు, వీడియోలను తమ ట్విటర్‌ ఖాతాల్లో పోస్టు చేశారు. పిల్లి, పాము, తొండ తదితర వన్యప్రాణులను పబ్‌కు వచ్చిన వారు పట్టుకోవడం ఒంటిమీద పెట్టుకోవడం, వాటితో ఆడుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

దీంతో జూబ్లీహిల్స్‌లోని నైట్‌క్లబ్ వివాదానికి కేంద్రంగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ (Viral) కావడంతో పోలీసులు, అటవీ అధికారులు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 36లో ఉన్న ప్రముఖ నైట్ క్లబ్ అయిన జోరాలో అన్యదేశ జంతువులు ఉన్నాయి. అటువంటి జంతువుల ప్రదర్శన నిషిద్ధం. క్లబ్ లోపల జంతువులను ప్రదర్శించిన దృశ్యాలు  వైరల్‌గా మారాయి. దీంతో క్లబ్ తీరుపై విస్తృత విమర్శలకు దారితీసింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీసులు ఘటన గురించి మాట్లాడారు.

ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని చెప్పారు. అయితే తమ షోలలో కనిపించే జంతువులన్నీ (Animals) చట్టబద్ధంగా పొందబడ్డాయని, వాటికి అవసరమైన లైసెన్సులు మరియు అనుమతులు ఉన్నాయని క్లబ్ స్పష్టం చేసింది. జంతువుల సంక్షేమం, భద్రత చాలా ముఖ్యం. ఈవెంట్‌ల సమయంలో ఎటువంటి హాని జరగలేదని అన్నారు. అవసరమైన అన్ని భద్రతా చర్యలను పాటిస్తున్నామని Xora బృందం పేర్కొంది.

Also Read: Vontimitta Temple: ఆంధ్రా అయోధ్యగా ‘ఒంటిమిట్ట రామాలయం’