NIA Raids : తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా NIA సోదాలు…వందమంది PFIకార్యకర్తల అరెస్టు..!!

రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా NIAఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో వంద చోట్ల ఏకకాలంలో సోదాలు జరుపుతోంది.

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 10:18 AM IST

రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా NIAఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో వంద చోట్ల ఏకకాలంలో సోదాలు జరుపుతోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ఆఫీసులతోపాటు కార్యకర్తల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఉగ్రవాద కార్యకలపాలకు నిధులు సమకూర్చడంతోపాటు యువతకు ఉగ్రవాద ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఆ సంస్థపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థకు చెందిన ఆఫీసులు, ముఖ్యనేతలు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తోంది ఎన్ఐఏ. తనిఖీలో కీలక ఆధారాలు సేకరించి…పలువురిని అరెస్టు చేసింది. ప్రస్తుతం AP, TELANGANA,కర్నాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో NIAసోదాలు నిర్వహిస్తోంది. పలు చోట్ల ఎన్ఐఏ తోపాటుగా ED కూడా దాడులు చేస్తోంది. దాదాపు వందమంది కార్యకర్తలను అరెస్టు చేసినట్లుగా సమాచారం.

కాగా హైదరాబాద్ లో చంద్రాయణ గుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయాన్ని సీజ్ చేసింది ఎన్ఐఏ. హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ తోపాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అటు కరీంనగర్, కర్నూలు, గుంటూరులోనూ సోదాలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లో తనిఖీలు చేసిన కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం సమాచారం. వారు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడులు జరుగుున్నట్లు సమాచారం.