Notices to Telangana Gov.: తెలంగాణ ప్రభుత్వానికి NHRC నోటీసులు

మెడికల్ విద్యార్థి ప్రీతి ఆత్మహత్య పై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయడానికి జాతీయ మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగింది. తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ లు జారీ

Published By: HashtagU Telugu Desk
Nhrc Notices To Telangana Govt

Nhrc Notices To Telangana Govt

మెడికల్ విద్యార్థి ప్రీతి ఆత్మహత్య పై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయడానికి జాతీయ మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగింది. తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ లు జారీ చేసింది. కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు NHRC నోటీసులు (Notices) ఇచ్చింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీకి బంధువు సైఫ్ సీనియర్ వేధింపుల వల్ల ప్రీతి ఆత్మహత్యయత్నం చేసుకుందని భావిస్తూ జాతీయ మానవ హక్కుల కమీషన్ తెలంగాణ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి, ప్రిన్సిపాల్ సెక్రటరీ,హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్, కలెక్టర్ వరంగల్ (అర్బన్), వరంగల్ పోలీస్ కమీషనర్ లకు నోటీసులు (Notices) పంపింది.

జడ్సన్ ఫిర్యాదు ఇలా ఉంది..

‘తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) లో మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ధరావత్, తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీకి బంధువు అయిన సైఫ్ అనే సీనియర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థి ఇది 22/02/2023 తేదీన కాకతీయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో ఒకటైన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (MGMH)లో జరిగింది. సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన సైఫ్‌పై తమ కుమార్తె కార్యాలయంలో వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసినా కేఎంసి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రీతి కుల వివక్షకు గురైందని, ర్యాగింగ్‌కు గురైందని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను KMC అధికారులు తోసిపుచ్చారు అని జాతీయ మానవ హక్కుల కమీషన్ 24/02/22 న ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు.’ ఆ మేరకు గురువారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి, ప్రిన్సిపాల్ సెక్రటరీ,హెల్త్ , మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్, కలెక్టర్ వరంగల్ (అర్బన్), వరంగల్ పోలీస్ కమీషనర్ లకు నోటీసులు (Notices) జారీ చేసింది.

చదువుకుంటున్న స్థలంలో సైఫ్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్టాఫ్ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన సీనియర్లు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయితే, ఆమెకు ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో, ఆమెను హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కి బదిలీ చేశారు. పోలీసులు సైఫ్‌పై ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. మెదక్లో ఖదీర్ ఖాన్ కస్టఓడియల్ డెత్ పై నోరు మెదపని తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీ, తన బంధువు అయిన సైఫ్ ను కాపాడే ప్రయత్నం చేస్తుండని జడ్సన్ ఆరోపణ. తెలంగాణ హోమ్ మంత్రి బంధువులను కాపాడుకోవడానికే ఉన్నాడా? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.

Also Read:  Poor People Welfare: పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అన్ని చదవగలరు

  Last Updated: 10 Mar 2023, 10:01 AM IST