Site icon HashtagU Telugu

New Year 2023: న్యూ ఇయర్ కిక్ మాములుగా లేదుగా.. ఏకంగా ఒక్కరోజే రూ. 215 కోట్లు మందు తాగిన మందుబాబులు!

Photo 2021 10 10 17 07 58

Photo 2021 10 10 17 07 58

New Year 2023: మామూలుగా ఈ మధ్యకాలంలో మద్యపానంకు ఎంతలా డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం. కేవలం వయసు మీద ఉన్న వాళ్ళే కాకుండా యువత కూడా మందుతో బాగా చిల్ అవుతున్నారు. అమ్మాయిలు కూడా ఎందులో తగ్గము అన్నట్లుగా వాళ్ళు కూడా ఎత్తిన బీర్లు దింపట్లేదు. దీంతో ఈ జనరేషన్ లో మద్యపానం తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

ఏదైనా సంతోషం కలిగిన, బాధ కలిగిన మద్యపానాన్నే ఎంచుకుంటున్నారు. ఇక అలా ప్రతి ఎందుకు బాగా డిమాండ్ పెరిగిపోవడంతో వైన్స్ షాప్పులు కూడా ఎక్కువ అయ్యాయి. ప్రతి పండుగకు కూడా మద్యపానం డిమాండ్ బాగా పెరిగిపోతుంది. ఇక న్యూ ఇయర్ సమయంలో, బర్త్డే వేడుకల సమయంలో వీటి కొనుగోలు అంతా ఇంతా ఉండదు.

ఇక ఈ మధ్యకాలంలో వీటికి బాగా డిమాండ్ ఉండడం వల్ల ఎక్సైజ్ శాఖ బాగా సంపాదించుకుంటూ పోతుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న డిసెంబర్ 31 సందర్భంగా ఒక్కరోజే మందుబాబులు తమ సీసాల కొనుగోలుతో బ్రేక్ ఇచ్చారని చెప్పవచ్చు. తాజాగా చేసిన అధ్యాయం ప్రకారం తెలంగాణలో నిన్న అనగా డిసెంబర్ 31న ఏకంగా రూ.215 కోట్ల 74 లక్షల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. నిజానికి ఇది బ్రేక్ ను బద్దలు కొట్టిన విషయమని చెప్పవచ్చు.

మామూలుగా మద్యం అమ్మకాలు చాలా వరకు తగ్గటంతో ధరలు పెంచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా మందుబాబులు డిసెంబర్ 31 ను నిరాశ పరుచకుండా బాగా చిల్ చేయటానికి ఖర్చు కోసం వెనకాడకుండా ఎక్కువ మొత్తంలో మద్యం బాటిల్స్ కొనుగోలు చేశారు. తాజాగా వాటి వివరాలు కూడా బయటకు రాగా అవేంటో చూద్దాం.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 డిపోల నుండి జరిగినా రిటైల్ అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి. 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు, లక్షా 28 వేల 455 కేసుల బీర్లు. హైదరాబాద్ 1 డిపోలో 15 వేల 251 లిక్కర్ కేసులు, 4 వేల 141 కేసులు బీర్లు, 16 కోట్ల 90 లక్షల ఆదాయం. 2 డిపో లో 18 వేల 907 లిక్కర్ కేసులు, 7 వేల 833 కేసుల బీర్ కేసులు, 20 కోట్ల 78 లక్షల ఆదాయం. మొత్తం రెండు డిపోలో వచ్చిన ఆదాయం రూ. 37 కోట్ల 68 లక్షలు వచ్చాయి.

Exit mobile version