Site icon HashtagU Telugu

Beautician Swetha Reddy Case : శ్వేతారెడ్డి కేసులో కొత్త కోణం.. మొబైల్ ఫోన్లను పరిశీలించడంతో…!

Swethareddy Case

Swethareddy Case

కొన్ని ఫేస్ బుక్ పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీయడంతోపాటు ఏకంగా ప్రాణాలను కూడా బలిగొంటున్నాయి. హైదరాబాద్ లోని శ్వేతారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనం. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. మీర్ పేఠ్ పీఎస్ పరిధిలో ప్రశాంత్ హిల్స్ లో జరిగిన ఘటనలో శ్వేతారెడ్డి తమ మిత్రుడితో ప్రియుడిని హత్య చేయించిన ఘటనలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ బయటపడింది.

శ్వేతారెడ్డి బ్యూటీషియన్. ఆమె భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఆమెకు బాగ్ అంబర్ పేట్ లో ఉన్న 32 ఏళ్ల యశ్మకుమార్ తో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధం వరకు వెళ్లింది. ఈ పరిచయాన్ని ఉపయోగించుకున్న యశ్మకుమార్.. ఆమె నగ్నఫోటోలు, వీడియోలను తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే వాటిని బయటపెడతానని బెదిరించడంతో శ్వేతారెడ్డి ఆందోళనకు గురైంది. పైగా ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడు. దీంతో శ్వేతారెడ్డి ఏకంగా పెద్ద పథకాన్ని వేసింది.

యశ్మకుమార్ ను అడ్డు తొలగించుకుంటే ఏ సమస్యా ఉండదని శ్వేతారెడ్డి భావించింది. అందుకే తనకు ఫేస్ బుక్ లో పరిచయం అయిన కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొంగల అశోక్ ను ఫోన్ ద్వారా సాయం అడిగింది. వారిద్దరూ స్కె్చ్ వేశారు. దాని ప్రకారం ఈ నెల నాలుగోతేదీన యశ్మకుమార్ కు ఫోన్ చేసి ప్రశాంత్ హిల్స్ కు రమ్మని చెప్పింది. తమ వివాదాన్ని ఫైనల్ గా సెటిల్ చేసుకుందామని చెప్పింది. అప్పటికే అక్కడ అశోక్ తన స్నేహితుడు కార్తీక్ తో కలిసి సిద్ధంగా ఉన్నారు.

యశ్మకుమార్ రాగానే అతడి తలపై సుత్తితో కొట్టడంతో అతడు పడిపోయాడు. కానీ అదే సమయంలో మనసు మార్చుకున్న శ్వేతారెడ్డి యశ్మకుమార్ ను వదిలేయాని అశోక్ కు మెసేజ్ చేసింది. కానీ అప్పటికే అశోక్ తమ స్కెచ్ ను అమలు చేశాడు. తల వెనుక కొడితే మతిస్థిమితం కోల్పోతాడని అనుకున్నామని నిందితులు పోలీసులతో చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. వారి మొబైల్ ఫోన్లను పరిశీలించడంతో కొత్త విషయాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది.

Exit mobile version