New Degree Syllabus : వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి తెలంగాణలో కొత్త డిగ్రీ సిలబస్ అమల్లోకి రాబోతోంది. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను సాధించి పెట్టేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించేలా కొత్త సిలబస్ ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. డిగ్రీ విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని, ఇతరత్రా టెక్నికల్ నాలెడ్జ్‌ను పెంచడంతో పాటు ఇంటర్న్‌షిప్‌లకు పంపడం వంటి ఏర్పాట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేస్తారని తెలుస్తోంది. తరగతి గది బోధనకు ప్రాధాన్యం ఇస్తూనే ప్రాక్టికల్స్‌పై ఫోకస్‌ను పెంచనున్నారు. త్వరలో డిగ్రీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీలను నియమించి సిలబస్‌లను సమీక్షించాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి(New Degree Syllabus) అధికారి ఒకరు తెలిపారు. నిపుణుల కమిటీలు చేసే సిఫారసుల ఆధారంగా నూతన సిలబస్‌లు రూపుదిద్దుకుంటాయి. తదుపరిగా కొత్త సిలబస్‌తో తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను ప్రింట్ చేయిస్తారు.
Also Read :Childrens Day 2024 : బాలల దినోత్సవాన్ని నవంబరు 14నే ఎందుకు నిర్వహిస్తారంటే..
ఇంజినీరింగ్ కోర్సుల్లోప్రతి మూడేళ్లకోసారి సిలబస్‌ను రివైజ్ చేస్తున్నారు. డిగ్రీ కోర్సుల్లో మాత్రం సిలబస్ మార్పులు అరుదుగా జరుగుతున్నాయి. దీనివల్ల విద్యార్థులకు నష్టమే జరుగుతోంది. కాలానికి అనుగుణంగా, ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అప్‌డేట్ కాలేకపోతున్నారు. విద్యార్థులకు ఈవిధంగా నష్టం జరగకుండా చూసేందుకు.. ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు తెలంగాణలో డిగ్రీ సిలబస్‌ను మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో చివరిసారిగా 2019లో డిగ్రీ సిలబస్‌ను మార్చారు. డిగ్రీ ఫైనలియర్‌లో తప్పకుండా ఇంగ్లిష్ సబ్జెక్టు ఉండాలని అప్పట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి డిగ్రీ సిలబస్‌ను కూడా ప్రతి మూడేళ్లకు ఒకసారి మార్చే హక్కు ఉన్నత విద్యామండలికి ఉంది. అయితే ఈ హక్కును మర్చిపోయి ఉన్నత విద్యామండలి వ్యవహరించింది. గత మూడేళ్లలో తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో బీకాం డేటా సైన్స్, బీఎస్సీ ఏఐ అండ్ ఎంఎల్ లాంటి విభిన్న కోర్సులను ప్రవేశపెట్టినా.. వాటి సిలబస్‌లను మాత్రం కొత్త టెక్నాలజీలు, కొత్త పరిణామాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయలేదు.