హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరికొన్ని ఆర్టీసీ బస్టాండ్ (New RTC Bus Stands) లను నిర్మించేందుకు తెలంగాణ సర్కార్ (Telangana Govt) కసరత్తులు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకరావడం తో ఎక్కడ చూడు బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. గతంలో రోజుకు 30 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే, ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయింది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగడంతో, ఆర్టీసీ అదనపు బస్సులను ప్రవేశపెట్టింది. అయితే, ఈ అధిక రద్దీ కారణంగా ఎంజీబీఎస్ బస్టాండ్‌పై భారీ ఒత్తిడి పెరుగుతోంది.
Viral News : కలికాలం బ్రదర్.. బాయ్‌ఫ్రెండ్ కోసం రోడ్డుపై కొట్టుకున్న యువతులు
ప్రస్తుతం ఎంజీబీఎస్ (MGBS) నుంచి తెలంగాణ, ఏపీకి చెందిన పలు ప్రాంతాలకు రోజూ 4,000 బస్సులు, 1.2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీకెండ్స్‌లో ఈ సంఖ్య 1.5 లక్షల మందికి, పండగల సమయంలో 1.8 లక్షలకు పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో ఉండే ప్రయాణికులు కూడా ఎంజీబీఎస్‌కు రావాల్సిన పరిస్థితి ఉండటంతో, ఆర్టీసీ అధికారులు నగరంలో కొత్త బస్టాండ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రణాళికలో భాగంగా ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఒక ఆధునిక బస్టాండ్ నిర్మించనున్నారు. ఈ ప్రాంతం నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరు వెళ్లే బస్సులు ఎక్కువగా నడుస్తాయి. అలాగే ఉప్పల్ ప్రాంతం నుంచి వరంగల్, నల్గొండ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సౌలభ్యం కోసం మరో బస్టాండ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. నల్గొండ, ఏపీ జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల రాకపోకల సౌలభ్యం కోసం ఎల్బీనగర్ వద్ద మూడో బస్టాండ్ నిర్మించనున్నారు.
World Cancer Day : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం చరిత్ర తెలుసా..?
ఈ కొత్త బస్టాండ్ల నిర్మాణంతో జిల్లాల నుంచి వచ్చే బస్సులు నేరుగా శివారు ప్రాంతాల్లోని బస్టాండ్ల నుంచే రాకపోకలు సాగించేలా మారుతుంది. దీంతో నగర ట్రాఫిక్‌కు తక్కువ భారమవ్వడంతో పాటు, ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. అదే సమయంలో ఎంజీబీఎస్ బస్టాండ్‌పై ఉండే ఒత్తిడిని తగ్గించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో బస్టాండ్ నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం.