New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే నెల(అక్టోబరు)లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులను విడివిడిగా జారీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రేషన్ కార్డుల జారీలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(New Ration Cards) మీడియాతో మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందేలా చూస్తామని చెప్పారు. జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు.
Also Read :Elon Musk Bodyguards : అంత సెక్యూరిటీయా.. బాత్‌రూంలోనూ వదలని మస్క్ సెక్యూరిటీ గార్డ్స్!
ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని ఉతమ్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 49476 రేషన్ కార్డులను కొత్తగా ఇచ్చారని తెలిపారు. అవి కూడా బై ఎలక్షన్ ఉన్న నియోజకవర్గాల్లోనే ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ఒక పద్ధతి ప్రకారం ఎక్కడా రేషన్ కార్డులను ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికి రేషన్‌కార్డులను అందిస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈసారి ఖరీఫ్ సీజన్ నుంచి వడ్లకు క్విటాలుకు రూ.500 అదనంగా ఇస్తామని వెల్లడించారు.
Also Read :Gold Mine Dispute: బంగారు గని స్థలం కోసం ఘర్షణ.. 30 మంది మృతి
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో అప్లై చేసుకున్నారు. రేషన్ కార్డుల మంజూరుపై కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈనెల 21న సమావేశం కానుంది. ఈ కమిటీలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఉన్నారు. ఇప్పటివరకు ఈ కమిటీ నాలుగు పర్యాయాలు సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో రేషన్ కార్డుల జారీకి అనుసరిస్తున్న విధి విధానాలపై ఈకమిటీ స్టడీ చేసింది. వాటి ఆధారంగా తెలంగాణలోనూ రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను త్వరలోనే జారీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 30.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.