New Ration Cards : రేషన్ కార్డు లేకపోవడంతో చాలామంది రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వాడుకోలేకపోతున్నారు. తమ పిల్లల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చాలంటూ ఎంతోమంది చేసిన అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు కూడా భారీగానే క్యూలో ఉన్నాయి. త్వరలోనే ఈ అప్లికేషన్ల ప్రాసెసింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీఆర్వోలతో క్షేత్ర స్థాయి తనిఖీలు చేయించి, అర్హులైన వారి అప్లికేషన్లను అప్రూవ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు త్వరలో అమలు చేయనున్న మరిన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అత్యంత కీలకంగా మారనుంది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకాలతో పాటు సన్నబియ్యం పంపిణీకి రేషన్ కార్డులు అవసరం అవుతాయి. అర్హులైన కుటుంబాల సంఖ్య పెరగడంతో రేషన్ కార్డుల(New Ration Cards) కోసం దరఖాస్తులు పెద్ద ఎత్తున వస్తున్నాయని మీసేవా కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.