New Railway Terminal : హైదరాబాద్‌లో కొత్త రైల్వే టెర్మినల్.. ఎన్ని సౌకర్యాలో తెలుసా ?

New Railway Terminal : మన హైదరాబాద్‌లో మరో కొత్త రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతోంది.

  • Written By:
  • Updated On - February 13, 2024 / 08:25 AM IST

New Railway Terminal : మన హైదరాబాద్‌లో మరో కొత్త రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతోంది. కొత్తగా అందుబాటులోకి రాబోయే రైల్వే టెర్మినల్ నుంచి 25 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. దీంతో మహా నగరం నుంచి నిత్యం రాకపోకలు సాగించే  లక్షలాది మందికి ఎంతో సౌకర్యం కలుగనుంది. ఇంతకీ ఈ రైల్వే టెర్మినల్ ఎక్కడ ఏర్పాటు అవుతుందో తెలుసా ?  చర్లపల్లిలో !!  చర్లపల్లి వద్ద నిర్మించిన రైల్వే స్టేషన్‌ ప్రయాణికుల కష్టాలకు పరిష్కారం చూపుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం 10 ప్లాట్‌ఫామ్‌లే ఉన్నాయి. ట్రైన్లు ఆగడానికి ఖాళీ ఉండటం లేదు. దీంతో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను హైదరాబాద్ నగర శివార్లలోనే గంటల పాటు నిలపాల్సి వస్తోంది. ఈ సమస్యకు త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్‌(New Railway Terminal) పరిష్కారాన్ని చూపబోతోంది.

We’re now on WhatsApp. Click to Join

  • చర్లపల్లి స్టేషన్‌ నుంచి 25 ట్రైన్లు నేరుగా రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు అంటున్నారు.
  • త్వరలోనే లింగంపల్లి నుంచి విజయవాడ వైపునకు వెళ్లే ట్రైన్లు.. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వెళ్లకుండా సనత్‌నగర్‌ -మౌలాలి మీదుగా నేరుగా చర్లపల్లికి చేరుకుంటాయని చెబుతున్నారు.
  • చర్లపల్లి స్టేషన్‌లో మెుత్తం 6 ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వస్తాయట. ఇందులో రెండు రైల్వే ప్లాట్ ఫామ్‌లను ఎంఎంటీఎస్‌లకు కేటాయిస్తారు.
  • ఈ స్టేషన్‌కు ఎంఎంటీఎస్‌లు నేరుగా వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. సికింద్రాబాద్‌ – చర్లపల్లి మధ్య తిరిగే MMTS ట్రైన్లతో ప్రయాణికులు నగరానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటారు.
  • మౌలాలి నుంచి చర్లపల్లి వరకు 4 రైల్వే లైన్లు అందుబాటులోకి రానున్నాయి. మార్చి మెుదటి వారంలో ప్రధాని మోడీ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అందుబాటులోకి తేనున్నారు.

Also Read : Inside UAE Temple : ఇవాళ అబుధాబిలో మోడీ సభ.. తొలి హిందూ దేవాలయం ఫొటోలివీ

ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అర కిలోమీటరు దూరంలోనే చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ఉంది. నగరం నలువైపులకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇప్పుడు లోకల్ రోడ్లను వినియోగించడం లేదు. వీరంతా ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు.. అక్కడి నుంచి ప్రయాణికులు ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా ఇళ్లకు చేరుకునే వెసులుబాటు ఉంటుంది.