Site icon HashtagU Telugu

CM Revanth Reddy : తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ – సీఎం రేవంత్

We will start Rythu Bharosa soon: CM Revanth Reddy

We will start Rythu Bharosa soon: CM Revanth Reddy

తెలంగాణ సీఎం (Telangana CM) గా పదవి చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే..మరోపక్క రాష్ట్ర అభివృద్ధికి గాను పలు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తేవాలని, దీనికి గాను ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్‌ పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతే కాదు అవసరమైన చోట పీపీపీ విధానం అవలంబించాలని సూచించారు.అలాగే హైదరాబాద్‌ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేయడానికి స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ(స్పీడ్) 19 ప్రాజెక్టులపై రూపొందించిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈరోజు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ‘స్పీడ్’ ప్రాజెక్టులో భాగమైన అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతికుమారితోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె అక్రమ నిర్మాణాలపై రేవంత్ తీసుకొచ్చిన హైడ్రా..ఇప్పుడు సంచలనం రేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హైడ్రా మీదే చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తోంది. దూసుకొస్తున్న బూల్డోజర్లు, నేల మట్టమవుతోన్న భవనాలు పేపర్లలో, టీవీల్లో ఇప్పుడివే హాట్ టాపిక్ అవుతున్నాయి. హైడ్రా అంటే ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడిన హైదరాబాద్‌ మహా నగరం నేడు కాంక్రీట్ జంగిల్‌గా మారింది. చినుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి, నాలాలాను మూసేసి నిర్మాణాలు చేపట్టడమే కారణమన్నది అందరికీ తెలిసిందే. దీన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్.. హైదరాబాద్‌ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా హైడ్రాను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలు , చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ఎవర్ని వదిలిపెట్టడం లేదు. అధికార పార్టీ నేతలు, సినీ , బిజినెస్ రంగ ప్రముఖులు ఇలా ఇవ్వరని వదిలిపెట్టకుండా నోటీసులు అందించడం..నిర్మాణాలు కూల్చేయడం చేస్తున్నారు. హైడ్రా పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదో గొప్ప నిర్ణయమని ..ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం ఉండాలని కొనియాడుతున్నారు.

Read Also : Oropouche Virus : రెండు కొత్త వైరస్‌ల ముప్పు ప్రపంచాన్ని భయపెడుతోంది, అవి ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి..!