Site icon HashtagU Telugu

IT Park : హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్..ఎక్కడంటే !

New It Park

New It Park

హైదరాబాద్ నగరం(Hyderabad)లో ఐటీ విస్తరణలో మరో ముందడుగు పడనుంది. ప్రభుత్వం గోపన్పల్లి తండా (Gopanpally Thanda) పరిసరాల్లో కొత్త ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఉన్న భూములపై వివాదాలు నెలకొనడంతో, అక్కడి నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రాంతం అమెరికన్ కాన్సులేట్‌కు సమీపంలో ఉండటంతో, రవాణా సదుపాయాలు, భద్రత వంటి అంశాల్లో అనుకూలంగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Rain Effect : ఆగిపోయిన SRH – DC మ్యాచ్

ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించి, ఆ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్, అలాగే నిషేధిత జాబితాల్లో ఉన్న భూముల వివరాలను పంపాలని సూచించింది. మొత్తం 440 ఎకరాల భూమిని ఐటీ పార్క్ కోసం అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. భూముల స్థితి, యాజమాన్యం, సంబంధిత చట్టాలు వంటి అంశాలపై పూర్తి స్థాయిలో మరోసారి సర్వే చేయాలని నిర్ణయించారు.

ఈ ఐటీ పార్క్ నిర్మాణం ద్వారా పలు ఐటీ సంస్థలు ఈ ప్రాంతంలో ఏర్పాటవడంతో ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విలువలు పెరగడంతో పాటు, ఆధునిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందనున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ ఐటీ రంగంలో మరింత శక్తివంతంగా మారే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.