Site icon HashtagU Telugu

Revanth Vs Komatireddy : రేవంత్ కోమటిరెడ్డి మధ్య కొత్త గొడవ

Komati Reddy Revanth Reddy

Komati Reddy Revanth Reddy

పీసీసీ ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ్డ‌ కోమ‌ట్ రెడ్డి వెంక‌ట్ రెడ్డి కోద్ది కాలం గాంధీ భ‌వ‌న్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. మోన్నామ‌ధ్య రేవంత్ రెడ్డి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ఇంటికి వెళ్లి మ‌రి మాట్లాడ‌డంతో ఇద్దరూ క‌ల‌సి ప‌నిచేస్తారని అంద‌రూ భావించారు. కానీ ఇంత‌లోని పార్టీలో టిక్కెట్ల వ్యవహారం మ‌ళ్లీ కొత్త పంచాయితి పెట్టింది.

హుజూరాబాద్ ఎన్నిక‌ల ప్రచారం సందర్బంగా పెద్దపల్లి టిక్కెట్ విజ‌య‌రామారావుకే అంటూ రేవంత్ చేసిన ప్రకటన పార్టీలో కాక‌రేపింది. అప్పుడు చాలా మంది నేత‌లు ఈ ప్రకటనను వ్యతిరేకించారు. అయితే కోమ‌టి రెడ్డి మాత్రం అప్పుడు సైలెంట్ గానే ఉన్నారు. అయితే ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి వేలు పెట్టడాన్ని కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి సహించలేక పోతున్నాడట. నల్గొండ జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో రేవంత్ రెడ్డి కి సంబంధించిన‌ వ్యక్తులకు టిక్కెట్ ఇస్తాన‌ని రేవంత్ రెడ్డి మౌకికంగా భరోసా ఇవ్వడం ప‌ట్ల కోమ‌టి  రెడ్డి గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. జ‌న‌గామ, తుంగ‌తుర్తి నిమోజ‌క‌వ‌ర్గాలే కాకుండా నల్గొండ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఒకరిద్దరు నేతలకు ప‌నిచేసుకోండ‌ని రేవంత్ రెడ్డి చెప్పినట్లు కోమ‌టి  రెడ్డి ఆరోపిస్తున్నారట. ఇలా అయితే రేవంత్ ను ఎలా స‌పోర్ట్ చేసేద‌ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద కోమ‌టి రెడ్డి వాపోతున్నార‌ట.

ఈ వ్యవహారంపై సోనియా గాంధీకి లేఖ ద్వారాఫిర్యాదు చేయాల‌ని కోమ‌టి  రెడ్డి డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. అధిష్టానం ప‌ట్టించుకోక పోతే త‌న దారి తాను చూసుకుంటాన‌ని స‌న్నిహితుల వద్ద వెంకట్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నార‌ట. ఇక క‌లిసిపోయార‌నుకుంటున్న నేత‌ల మధ్య మ‌ళ్లీ గ్యాప్ రావ‌డం పార్టీకి అంత మంచిది కాద‌ని, ఇద్దరు నేత‌లు మ‌ట్లాడుకుంటే మంచిద‌ని స‌ల‌హా ఇస్తున్నార‌ట పార్టీ సీనియర్లు.