Site icon HashtagU Telugu

Education Policy : తెలంగాణ లో త్వరలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ!

Revanth Education Policy

Revanth Education Policy

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) త్వరలో కొత్త విద్యా విధానాన్ని (Education Policy) ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన విధానం తమిళనాడు తరహాలో ఉంటుందని, దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నారని సమాచారం. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ (TEP)ని రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇది రాష్ట్ర విద్యా రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని భావిస్తున్నారు.

Harish Target : అంతర్గత కలహాలతోనే హరీశ్ ను టార్గెట్ చేశారు – మహేశ్ కుమార్

ఈ నూతన విద్యా విధానం రూపకల్పన కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అడ్వైజర్ కె. కేశవరావు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ జాతీయ విద్యా విధానం (National Education Policy – NEP)లోని ముఖ్య అంశాలను పరిగణనలోకి తీసుకుని, వాటిని రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి, ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించనుంది.

కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తే, పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అనేక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త విధానం ఎలా ఉండబోతోంది, అందులో ఏయే అంశాలు కీలకంగా ఉంటాయోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.